చంద్రబాబుపై సిబిఐ విచారణా ?

First Published 3, Apr 2018, 2:19 PM IST
Ycp mp vijaya sai demands cbi enquiry on chandrababu
Highlights
రాజధానికి నిధులు, భూ సేకరణ, పోలవరం, పట్టిసీమ లాంటి అంశాల్లో చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఎంపి మండిపడ్డారు.

చంద్రబాబునాయుడుపై సిబిఐ విచారణ చేయించాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాజధానికి నిధులు, భూ సేకరణ, పోలవరం, పట్టిసీమ లాంటి అంశాల్లో చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఎంపి మండిపడ్డారు.

అవినీతి, బంధుప్రీతి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని భూములు, ఇసుక దందా, దేవాలయ భూములు, పట్టిసీమ, సెక్స్‌ రాకెట్‌ వంటి పది అంశాల్లో చంద్రబాబుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చంద్రబాబు లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

హవాలా రూపంలో అవినీతి సొమ్మును విదేశాలకు బాబు తరలించారని చెప్పారు. కాగా, సోమవారం విజయ్‌ మాల్యా నుంచి చంద్రబాబుకు రూ. 150 కోట్లు అందాయని విజయసాయి ఆరోపించిన విషయం తెలిసిందే.

 

loader