టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా? అవుననే అంటున్నారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అదే విషయమై గురువారం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. వైసిపి ఎంఎల్ఏలు గనుక టిడిపిలోకి వస్తే ప్రతీ ఎంఎల్ఏకు రూ. 25 కోట్లు ఇస్తామని టిజి ఆఫర్ చేసినట్లు మండిపడ్డారు.

అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టుతో పాటు ఎన్నికల ఖర్చు మొత్తం పెట్టుకుంటామని ఆఫర్ చేస్తున్నట్లు రెడ్డి ధ్వజమెత్తారు. సమయం వచ్చినపుడు టిజి వెంకటేశ్, టిడిపి బండారం మొత్తాన్ని బయటపెడతానని హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.