Asianet News TeluguAsianet News Telugu

వెంకయ్యకు క్షమాపణలు చెప్పిన విజయసాయి రెడ్డి

 ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఇలా చేస్తే సభ నుంచి వాకౌట్‌ చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఆయన వైఖరిపై అధికార, విపక్ష సభ్యులందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ycp mp viajayasai reddy says soory to venkaiah naidu

ఏపీ విభజన చట్టంపై నిన్న రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకి సభాముఖంగా క్షమాపణలు తెలిపారు.

ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో చర్చ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుండగా..  సమయం అయిపోయిందంటూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన్ని నిలువరించారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఇలా చేస్తే సభ నుంచి వాకౌట్‌ చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఆయన వైఖరిపై అధికార, విపక్ష సభ్యులందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ రోజు రాజ్యసభ ప్రారంభం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్ గోయల్‌ మాట్లాడుతూ.. నిన్నటి ఘటనకు సంబంధించి ఛైర్మన్‌కు విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు కాంగ్రెస్‌ సభ్యుడు ఆజాద్‌ సహా ఇతర పార్టీల సభ్యులు మద్దతు పలికారు. విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో విజయసాయి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం సభాముఖంగా క్షమాపణలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios