పవన్ ప్యాకేజీ ఆర్టిస్టు..

పవన్ ప్యాకేజీ ఆర్టిస్టు..

‘జనేసన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ ఆర్టిస్టు’...ఇవి వైసిపి ఎంల్ఏ రోజా పవన్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు. పోలవరం యాత్రకు వైసిపి ఎంల్ఏలు వెళ్ళేముందు రోజా మీడియాతో మాట్లాడారు.  బాబు ఎప్పుడు ఇబ్బందులో ఉన్నా వెంటనే పవన్ బయటకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. తప్పులు చేస్తున్న తెలుగుదేశంపార్టీని పవన్ ఎందుకు విమర్శించటం లేదని నిలదీసారు. చంద్రబాబును కాపాడటానికే పవన్ బయటకు వస్తారన్న విషయం చాలా సార్లు రుజువైందన్నారు. ప్రజా సమస్యలపై జగన్ ఎప్పుడు ఉద్యమాలు చేస్తున్నా వెంటనే చంద్రబాబునాయుడు జనసేన అధ్యక్షుడిని రంగంలోకి దింపుతారంటూ మండిపడ్డారు.

ప్రజారాజ్యంపార్టీ గురించి మాట్లాడుతూ, చిరంజీవిని మోసం చేసినందుకు ముందుగా తనను తానే శిక్షించుకోవాలన్నారు. తర్వాత చిరంజీవి బావ అల్లు అరవింద్, చంద్రదాబు, ఆయన ఛానళ్ళఉన్నాయని రోజా ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు చిరంజీవిని మోసం చేసింది పవన్ కల్యాణే అంటూ రోజా ఫైర్ అయ్యారు. ఇప్పటికైతే పవన్ టిడిపి మనిషిగానే తాము గుర్తిస్తున్నట్లు రోజా సంచలనం వ్యాఖ్యలు చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos