Asianet News TeluguAsianet News Telugu

‘సదావర్తి’: చంద్రబాబును ఇరికించేసిన ఆళ్ళ

  • ఏదో గప్ చుప్ గా వందల కోట్ల రూపాయల విలువైన సదావర్తి భూములను కొట్టేద్దామనుకుంటే అదికాస్త ఇపుడు పీకకు చుట్టుకుంది.
  • తమిళనాడులోని 84 ఎకరాల సత్రం భూములను తన మద్దతుదారుడైన రామానుజయ్యకు కట్టబెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.
  • సరే, ఆ విషయం విలుగు చూడటం, వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టుకెక్కటం తదితరాలన్నీ చంద్రబాబుకు బాగా చికాకు పెట్టేవే.
  • జాతీయ స్ధాయిలో వేలం పాట ప్రకటనను ప్రచురించాలని షరతు కూడా విధించింది.
Ycp mla alla put naidu in embarrassing situation in sadavarti lands auction issue

చంద్రబాబునాయుడు మెడకు సదావర్తి భూముల వ్యవహారం బాగా తగులుకుంది. ముందునుయ్యి వెనుక గొయ్యి లాగ తయారైంది చంద్రబాబు పరిస్ధితి. ఏదో గప్ చుప్ గా వందల కోట్ల రూపాయల విలువైన సదావర్తి భూములను కొట్టేద్దామనుకుంటే అదికాస్త ఇపుడు పీకకు చుట్టుకుంది. తమిళనాడులోని 84 ఎకరాల సత్రం భూములను తన మద్దతుదారుడైన రామానుజయ్యకు కట్టబెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. సరే, ఆ విషయం విలుగు చూడటం, వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టుకెక్కటం తదితరాలన్నీ చంద్రబాబుకు బాగా చికాకు పెట్టేవే.

రూ. 22.40 కోట్లకన్నా విలువ చేయవన్న ప్రభుత్వ వాదనను మొదట్లోనే ఆళ్ళ తప్పని నిరూపించారు. దాంతోనే చంద్రబాబు ప్రభుత్వ పరువు పోయింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అంతో ఇంతో మిగిలిందనుకున్న పరువు కూడా జాతీయ స్ధాయిలో పోబోతోంది. ఎలాగంటే, ఆళ్ళ చెల్లించిన రూ. 27.44 కోట్లను 84 ఎకరాలకు బేస్ ధరగా కోర్టు నిర్ణయించింది. సత్రం భూములను మళ్ళీ బహిరంగ వేలం ద్వారా మాత్రమే అమ్మాలని స్పష్టైన ఆదేశాలను జారీ చేసింది కోర్టు. అదికూడా జాతీయ స్ధాయిలో వేలం పాట ప్రకటనను ప్రచురించాలని షరతు కూడా విధించింది.

అంటే గుట్టుచప్పుడు కాకుండా మింగేద్దామనుకున్న భూముల అమ్మకాన్ని ఆళ్ళ జాతీయ స్ధాయికి తీసుకెళ్ళారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఇంకో కీలకమైన డైరెక్షన్ కూడా ఉంది. అదేంటంటే, జాతీయ స్ధాయిలో ఎవరు వేలం  పాటలో పాల్గొనాలన్నా బేస్ ధర రూ. 27.44 కోట్లే. అయితే, అంతకన్నా ఎవరు ఎక్కువ పాడితే ఆ భూములు వారికే చెందుతుంది. ఒకవేళ రూ. 27.44 కోట్లకన్నా ఎక్కువివ్వటానికి ఎవరూ ముందుకు రాకపోతే ఆ భూములను ఆళ్ళ రామకృష్ణారెడ్డికే రిజిస్టర్ చేయాలి ప్రభుత్వం. అంటే ఏ విధంగా చూసినా సత్రం భూములు మాత్రం చంద్రబాబు మద్దతుదారులకు దక్కవన్నది ఖాయమైపోయింది.

ఆళ్ళ పుణ్యమా అంటూ సత్రం భూముల వ్యవహారం జాతీయ స్ధాయిలో ప్రచారం జరిగింది. ఎలాగూ జాతీయ స్ధాయిలో వేలం నోటీసు ప్రకటించాలి కాబట్టి పెద్ద పెద్ద సంస్ధలో పాల్గొనే అవకాశం ఉంది. తమిళనాడు సంస్ధలే వేలంపాటలో భూములను తన్నుకుపోయినా ఆశ్చర్యం లేదు. సో, ఏరకంగా చూసినా నష్టపోయేది కమ్ పరువుపోయేది చంద్రబాబునాయుడు ప్రభుత్వానికే. మొత్తం మీద చంద్రబాబును ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాగా ఇరికించేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios