కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా.. టీడీపీలో ఉన్నట్లే..

First Published 13, Jul 2018, 5:01 PM IST
ycp leader peddi reddy rama chandra reddy fire on kiran kumar reddy
Highlights

కిరణ్ కుమార్ రెడ్డి.. తప్పుడు దారిలోనే ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. అప్పుడు కూడా టీడీపీ మద్దతుతోనే పార్టీ నడిపారని విమర్శించారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నా.. ఆయన మద్దతు ఎప్పుడూ టీడీపీకే ఉంటుందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పెద్ది రెడ్డి పలు ఆరోపణలు చేశారు.

గతంలో కిరణ్ కుమార్ రెడ్డి.. తప్పుడు దారిలోనే ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. అప్పుడు కూడా టీడీపీ మద్దతుతోనే పార్టీ నడిపారని విమర్శించారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నా.. ఆయన మద్దతు ఎప్పుడూ టీడీపీకే ఉంటుందన్నారు.

ఎన్నికల ముందు ఖర్చు పెట్టకుండా చెప్పుల పార్టీ పెట్టాడని, పీలేరు నుంచి కూడా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఏకాకిగా దొంగ చాటుగా కండువా వేసుకున్న వ్యక్తులు తమ జిల్లాలో పుట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ స్థాపించిన రోజున కాంగ్రెస్ చచ్చిపోయిందని, ఇపుడు ఆ పార్టీలో ద్రోహులు మాత్రమే ఉన్నారన్నారు. 

మరోవైపు చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్మును కూడబెట్టెందుకే పాటుపడుతున్నారని ఆరోపించారు. దోచుకున్నది దాచుకునేందుకే చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నాడు స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోకుండా ఇపుడు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.