అనంతపురం జిల్లాలో వైసిపి నేత హత్య

Ycp leader murdered in anantapuram dt
Highlights

  • అనంతపురం జిల్లాలో వైసిపి నేత చెన్నారెడ్డిని ప్రత్యర్ధులు బుధవారం తెల్లవారి దారుణంగా హత్య చేశారు.

అనంతపురం జిల్లాలో వైసిపి నేత చెన్నారెడ్డిని ప్రత్యర్ధులు బుధవారం తెల్లవారి దారుణంగా హత్య చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసిపి అధినేత వైఎస్ జగన్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే చెన్నారెడ్డిని ప్రత్యర్ధులు హత్య చేయటం సంచలనంగా మారింది. ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో ప్రత్యర్ధులు చెన్నారెడ్డిని హత్య చేసారు. రాజకీయకక్షల్లో భాగంగా ఈ హత్య జరిగిందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. చెన్నారెడ్డి తన పొలంలో పనులు చేయిస్తుండగా ప్రత్యర్ధులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సుమారు 8 మంది హత్యలో పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ ఏర్పాటైనప్పటి నుండి చెన్నారెడ్డి  మండలంలో క్రియాశీలకంగా ఉన్నారు.

కొంతకాలంగా వైసిసి నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్ధులు దాడులు చేసి హత్యలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోనే వైసిపి నేతలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దాడులు, హత్యలకు పాల్పడుతున్నవారిపై వైసిపి నేతలు ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. దాంతో అధికారపార్టీ నేతలు కావచ్చు లేదా వారి మద్దతుతో కావచ్చు వైసిపి నేతలపై దాడులు యధేచ్చగా సాగుతున్నాయి.

loader