అమరావతిని కట్టేది ఏపీనా..? సింగపూరా..?

YCP leader Dharmana Prasada rao comments against Amaravati
Highlights

అమరావతిని కట్టేది ఏపీనా..? సింగపూరా..?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా..? లేక సింగపూర్ ప్రభుత్వమా అని ప్రశ్నించారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అమరావతి నిర్మాణంలో టీడీపీ సర్కార్ అనేక అక్రమాలకు పాల్పడుతోందని ధర్మాన ఆరోపించారు. అసలు సింగపూర్ మంత్రి ఏ హోదాలో రాజధాని నిర్మాణ సంస్థతో సంతకాలు చేశారని.. ఆయన పర్యటనపై విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేయాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలోని భూములను కూరు చౌకగా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టారని.. ఇందుకు గాను గవర్నర్ పేరుతో 1500 జీవోలు విడుదలయ్యాయని.. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌ను కలుస్తుందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సదరు జీవోలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్రాన్ని కోరారు.
 

loader