రోజా కారణంగానే నంద్యాల్లో వైసీపి ఓటమీ ఖాయం అన్న అనిత రోజాకు అస్సలు రాజకీయాల మీద అవగాహాన లేదు. ఐరన్ లెగ్ అన్న రోజా.
రోజా పై టీడీపీ ఎమ్మెల్యే అనిత నిప్పులు చెరిగారు. రోజా కారణంగానే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ఒడిపోతారని ఆమె విమర్శించారు. రోజా ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతు రోజా పై విరుచుకుపడ్డారు
రోజాకు వైసీపి నాయకులు స్క్రిప్ట్ రాసిస్తుంటే ప్రచారంలో చదువుతుందని ఎద్దేవా చేశారు అనిత. ఆమెకు రాజకీయాల మీద ఏ మాత్రం అవగాహాన లేదని ఆరోపించారు. రోజా ఐరన్ లెగ్ అని అందరికీ తెలిసిన విషయమేనని అనిత వ్యంగ్యంగా అన్నారు. ఓ మహిళ అయి ఉండి మరో మహిళ డ్రెస్ గురించి మాట్లాడటం తగదని ఆమె సూచించారు. రోజా మాట్లాడుతున్న భాష మహిళ లోకం తలదించుకునే విధంగా ఉందని ఆమె ఆరోపించారు. వైసీపి అధ్యక్షుడు జగన్మోహాన్ రెడ్డి మీద కూడా ఆమె ధ్వజమెత్తారు.
