అనంతపురంలో జరిగే యువభేరి కార్యక్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. ఏపికి ప్రత్యేకహోదా తో పాటు విభజన హామీల అమలు సాధనకు ఈనెల 10వ తేదీన అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో జగన్ యువభేరి మోగిస్తారని జిల్లా నేతలు చెబుతున్నారు. పనిలో పనిగా జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా సమావేశంలో పాల్గొంటారు. జిల్లాలో పార్టీ పరిస్ధితి, నియోజకవర్గాలను బలోపేతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలు, మహాపాదయాత్ర తదితరాలపై జగన్ జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు.