రెండు వారాలపాటు క్యాంపు చేస్తాననటం ద్వారా అభ్యర్ధి గెలుపును జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమైపోతోంది. ప్రచారంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో జగన్ 9-21 తేదీల మధ్య గడపటమంటే మాటలు కాదు. రెండు వారాల క్యాంపులో నంద్యాల నియోజకవర్గాన్నిమున్సిపాలిటీ, మిగిలిన మండలాలుగా విడదీసారట.
నంద్యాల నియోజకర్గంలో దాదాపు రెండు వారాలపాటు క్యాంపు చేస్తాననటం ద్వారా అభ్యర్ధి గెలుపును జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమైపోతోంది. ప్రచారంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో జగన్ 9-21 తేదీల మధ్య గడపటమంటే మాటలు కాదు. సరే అన్ని రోజుల ప్రచారానికి సరిపడా రోడ్డుమ్యాప్ ను అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి సిద్దం చేసే ఉంటారులేండి. తన రెండు వారాల క్యాంపులో నంద్యాల నియోజకవర్గాన్నిమున్సిపాలిటీ, మిగిలిన మండలాలుగా విడదీసారట.
రెండువారాల క్యాంపులో మున్సిపాలిటీలో సుమారు ఐదు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. నంద్యాల కేంద్రంలోనే రోడ్డుషోలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని కూడా నిర్వహించనున్నారు. అదే విధంగా మిగిలిన మండల కేంద్రాల్లో చిన్నపాటి బహిరంగ సమావేశాలు, ఇంటింటి ప్రచారానికే ఎక్కువ ప్రధాన్యత ఇవ్వాలని అనుకున్నట్లు సమాచారం. అంటే నియోజకవర్గంలోని దాదాపు అందరు ఓటర్లనూ ఏదో ఓ రూపంలో కలవాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని అర్ధమవుతోంది.
నిజానికి ఇద్దరు అభ్యర్ధుల్లో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి కన్నా వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డే గట్టి అభ్యర్ధి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భూమా అధికారపార్టీ తరపున పోటీ చేస్తున్నారన్న విషయం మరచిపోకూడదు. అధికారపార్టీ అంటే చంద్రబాబునాయుడే. తెరపైన కనబడేది భూమానే అయినా తెరవెనుకనుండి నడిపించేది మొత్తం చంద్రబాబే కదా? ఆ విషయం తెలుసు కాబట్టే జగన్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు.
క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను బట్టి చూస్తే శిల్పాకే గెలుపు అవకాశాలు ఎక్కువ. ఆ విషయాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందచేసాయట. అందుకే రెండుసార్లు తాను పర్యటించటమే కాకుండా మొత్తం మంత్రివర్గాన్ని నంద్యాలకు తరుముతున్నారు వరుసగా. ప్రత్యర్ధి అయిన చంద్రబాబును దృష్టిలో పెట్టుకునే జగన్ కూడా ఏకంగా రెండువారాలపాటు క్యాంపు వేస్తున్నారు. ఉపఎన్నిక కోసం ఓ నియోజకవర్గంలో రెండువారాల పాటు ఓ ప్రతిపక్ష నేత క్యాంపు వేయటం బహుశా ఇదే మొదటిసారేమో.
