బిజెపిపై చంద్రబాబు తిరగబడతారా ?

Would Naidu take U turn against BJP
Highlights

ఎన్నికలు దగ్గర పడ్డ తర్వాత చంద్రబాబునాయుడు భారతీయ జనతా పార్టీపై తిరగబడతారా?

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమర్ పెద్ద సందేహాన్నే వ్యక్తం చేసారు. ఎన్నికలు దగ్గర పడ్డ తర్వాత చంద్రబాబునాయుడు భారతీయ జనతా పార్టీపై తిరగబడతారా? అంటూ అనుమానం వ్యక్తం చేసారు.

 

ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ పోలవరంకు రూ. 1900 కోట్లు, పురుషోత్తమ పట్నంకు రూ. 1800 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూ. 1600 కోట్లు ఇస్తారా అంటూ నిలదీసారు.

 

కేంద్రమే కట్టవలసిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా బదలాఇస్తుందని కేంద్రాన్ని నిలదీయటంలో తప్పేలేదు. ప్రాజెక్టుకు మంజూరు చేసిన నిధులను నబార్డ్ నేరుగా కేంద్రానికి ఇవ్వకుండా కేంద్రం సమక్షంలోనే రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వటంలో మతలబు ఏమిటన్నారు.

 

అసలు ఏమి జరుగుతోందో తనకైతే అర్ధం కావటం లేదని, పోని చంద్రబాబుకు, కేంద్రానికైనా క్లారిటి ఉందా అంటూ నిలదీసారు.

 

ఎన్నికలు దగ్గర పడ్డ తర్వాత ప్రాజెక్టులు పూర్తి కాకపోవటనికి కేంద్రమే కారణమని చెప్పి తప్పించుకునేందుకు చంద్రబాబు భాజపాపై తిరగబడతారేమో అన్న సందేహాన్ని కూడా ఉండవల్లి వ్యక్తం చేయటం గమనార్హం. నిజంగా అటువంటిది జరిగితే ప్రజలు క్షమించరని కూడా మాజీ ఎంపి హెచ్చరించారు.

 

తాను రాజీ పడకపోతే పోలరవంకు నిధులు వచ్చేవి కావన్న చంద్రబాబు మాటల వెనుక రహస్యం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ కూడా చేసారు. ఉండవల్లి డిమాండ్లు, సందేహాలు చూస్తుంటే నిజమేనేమో అని అనిపిస్తోంది.

loader