దటీజ్ జగన్...

First Published 20, Nov 2017, 7:07 PM IST
Women huge gathering in spite of police hurdles
Highlights
  • కర్నూలు జిల్లాలో టిడిపి లీడర్లకు ఒక్క సారిగా షాక్ తగిలింది.

కర్నూలు జిల్లాలో టిడిపి లీడర్లకు ఒక్క సారిగా షాక్ తగిలింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ సోమవారం మధ్యాహ్నం బనగానపల్లి నియోజకవర్గంలోని హుస్సేనాపూర్ లో మహిళలతో చిన్నపాటి సభ జరిపారు. ఈ కార్యక్రమం ఎప్పుడో నిర్ణయమైంది. కార్యక్రమం కోసం జిల్లా ఎస్పీ అనుమతి కూడా తీసుకున్నారు.

అయితే, హటాత్తుగా ఆదివారం రాత్రి పోలీసులు సభకు అనుమతిని రద్దు చేశారు. అదే విషయాన్ని పోలీసులు వైసీపీ నేతలకు చెప్పారు. అయితే, కారణాలు మాత్రం చెప్పలేద. దాంతో వైసీపీ నేతలకు అనుమానాలు వచ్చాయి. వాకాబు చేస్తే స్ధానిక టిడిపి నేతలే లోకల్ డిఎస్పీపై ఒత్తిడి తెచ్చి అనుమతి రద్దు చేయించారని తెలిసింది. దాంతో విషయం వైసీపీ నాయకత్వానికి చేరవేసారు. దాంతో సభ నిర్వహణను జగన్ ప్రతిష్టగా తీసుకున్నారు.

అంతే, హుస్సేనాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారందరికీ కబురెళ్ళింది. నియోజకవర్గంలోని నేతలు రంగంలోకి దిగారు. ఉదయం పాదయాత్రను ప్రారంభించిన జగన్ మద్యాహ్నం సభాస్దలికి చేరుకునే సరికి మహిళలతో ప్రాంగణం మొత్తం క్రిక్కిరిసిపోయింది. అంతమంది మహిళలు ఎలా వచ్చారు ? అంటే, సోమవారం ఉదయం మామూలుగా జగన్ సభలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున సభ జరిగే చోటుకు బయలుదేరారు. అయితే, ఉదయం నుండే అన్నీ వైపుల నుండి పోలీసులు కాపు కాసారు. మహిళలను ఎవరినీ హుస్సేనాపూర్ కు చేరుకోనీయకుండా అడ్డుకున్నారు. దాంతో ఎక్కడికక్కడ మహిళలకు, పోలీసులకు పెద్ద వాగ్వాదమే జరిగింది. పోలీసు ఆంక్షళను ఛేదించుకుని మరీ మహిళలు సభ జరిగిన చోటుకు చేరుకున్నారు.

జరుగుతున్న విషయాలను తెలుసుకున్న టిడిపి నేతలకు పెద్ద షాకే తగిలింది. పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా మహిళలు అంత పెద్ద ఎత్తున ఎందుకు వచ్చారో వారికి అర్దం కావటం లేదు. జగన్ పై అభిమానంతోనే హాజరయ్యారా? లేక తమ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయి జగన్ సభకు హాజరయ్యారా అన్నది లెక్కలేసుకోవటంలో టిడిపి నేతలు ముణిగిపోయారు.

loader