గుంటూరు: భార్యాభర్తల బందానికే మచ్చతెచ్చే సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. భార్యతో ఏకాంతంగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడమే కాదు ఈమె కావాలంటే సంప్రదించండంటూ ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేశాడో భర్త. ఈ విషయం తెలిసి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది.

వివరాల్లోకి వెళితే...  గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతికి 2019లో పాతగుంటూరుకు చెందిన యువకుడితో వివాహమైంది. అయితే అప్పటికే చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు కట్టుకున్న భార్యను వేధించడం ప్రారంభించాడు. అతడి వేధింపులను తట్టుకోలేకపోయిన భార్య పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. ఇలా పెద్దల సమక్షంలోనే భార్యాభర్తలు విడిపొయారు. 

read more   భర్తకు అప్పిచ్చి... ఇంట్లోంచి భార్యను తీసుకెళ్లి ఘాతుకం

అయితే తనను విడిచివెళ్లిన భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త మరో విధంగా ఆమెను వేధించడం ప్రారంభించాడు. గతంలో భార్యతో ఏకాంతంగా వుండగా ఫోటోలు, వీడియోలు తీసుకున్న అతడు వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యకరమైన కామెంట్స్ తో పోస్టులు పెట్టసాగాడు. ఇలా వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నట్లు భార్యకు చెప్పిమరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 

ఇలా భర్త చేష్టలతో విసిగిపోయిన వివాహిత గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకొని యువతికి న్యాయం చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు.