రైల్వే ప్లాట్ ఫాంపై ఓ మహిళ ప్రసవించింది. అయితే.. ఆమె పట్ల పారిశుద్ధ్య కార్మికులు మానవత్వం చూపించారు. దుప్పట్లు అడ్డుగా పెట్టి సదరు మహిళకు సహాయం చేశారు. ఈ సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఎర్నాకులం నుంచి ప్రతి ఆదివారం పాట్నాకు వెళ్లే రైలు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో తిరుపతికి చేరింది. ఆ రైలు నుంచి దిగిన ఓ గర్భిణనీ నడవలేని స్థితిలో ప్లాట్ ఫాంపై కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు పరుగున వచ్చి ఆమెను పట్టుకున్నారు.

Also Read కర్నూలులో హీరో వెంకటేష్ కి ఓటు..?

నిండు గర్భిణీ రావడంతో  ఆమెకు వెంటనే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆ కార్మికులు దుప్పట్లు తెచ్చి చుట్టూ అడ్డుగా పెట్టి సదరు మహిళకు సపర్యలు చేశారు. దీంతో సదరు మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే స్టేషన్ లోని హెల్త్ సెంటర్ సిబ్బంది, అధికారి ద్వారా ప్రథమ చికిత్స అందించి తర్వాత 108 వాహనంలో  రుయా ఆస్పత్రికి తరలించారు.

ఆ యువతి వద్ద ఉన్న ఫోన్ లోని ఓ నంబర్ ను సంప్రదించగా ఆమె పేరు ధను అని.. ఆమెది యశ్వంత్ పూర్ అని తెలిశారు. పోలీసులకు సమాచారం అందించారు.