సినీ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఆయన హైదరాబాద్ లో ఉంటారని కూడా తెలుసు. అయితే... ఆయనకి ఓటు మాత్రం కర్నూలు జిల్లా లో ఉంది. అది కూడా రాణి అనే స్త్రీ పేరిట ఉండటం గమనార్హం.

Also Read గుంటూరులో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి..

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నూలు నగర పాలక సంస్థ ఇటీవల ఓటరు జాబితా విడుదల చేసింది. అందులో హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. ఓ మహిళా ఓటరు పేరిట వెంకటేష్ చిత్రం ఉండటం విశేషం.  కర్నూలు నగరంలోని 31వ వార్డులోని ఓ మహిళా ఓటరు వివరాల దగ్గర వెంకటేష్ ఫోటో రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

కాగా... అధికారుల తప్పిదం కారణంగానే ఇలా జరిగిందని ఓటర్లు ఆరోపిస్తారు. ఇలాంటి తప్పులు ఇప్పటి వరకు చాలానే జరిగాయని వారు చెబుతున్నారు. కాగా... దీనిపై ఎన్నికల అధికారులు స్పందించారు. ఎన్నికలు రావడానికి చాలా కాలం ఉంది కాబట్టి... ఆలోపు  తప్పులను సరిచేస్తామని చెప్పారు.