చంద్రబాబునాయుడు ఊదరగొడుతున్న ‘ఎల్లోబుక్’ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇపుడా విషయంపైనే టిడిపిలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో గెలవటానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ నంద్యాల, కాకినాడ ఫార్ములానే అమలు చేయాలని 40 ఇయర్స్ ఇండస్ట్రీలో గట్టి ఆలోచన వచ్చింది. ఒక నియోజకవర్గంలోని గెలుపు సూత్రం మరో నియోజకవర్గంలో ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి గెలుపు సూత్రం నంద్యాలలోనే 2019 ఎన్నికలో పనికిరాకపోవచ్చు. మొన్నటి గెలుపు సూత్రం నంద్యాలలోనే 2019 ఎన్నికలో పనికిరాకపోవచ్చు.
చంద్రబాబునాయుడు ఊదరగొడుతున్న ‘ఎల్లోబుక్’ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇపుడా విషయంపైనే టిడిపిలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబులో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది లేండి. దాంతో 2019 ఎన్నికల్లో గెలవటానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ నంద్యాల, కాకినాడ ఫార్ములానే అమలు చేయాలని 40 ఇయర్స్ ఇండస్ట్రీలో గట్టి ఆలోచన వచ్చిందట. దాంతో అదే విషయాన్ని ఊదరగొడుతున్నారు.
ఇంతకీ నంద్యాల ఫార్ములాతో మిగిలిన నియోజకవర్గాల్లో అదీ సార్వత్రిక ఎన్నికల్లో గెలవటం సాద్యమేనా అన్న విషయంపై మిగిలిన నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ చంద్రబాబుకు అదేమీ పట్టటం లేదు. మంగళవారం జరుగనున్న వర్క్ షాపులో ఎల్లో బుక్ ను పంపిణీ చయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. చంద్రబాబు ప్రయత్నాలు చూడటానికి బాగానే ఉన్నా అసలు ఆచరణ సాధ్యమేనా అన్నదే అందరిలోనూ డౌట్. ఎందుకంటే, ఒక నియోజకవర్గంలోని గెలుపు సూత్రం మరో నియోజకవర్గంలో ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, మొన్నటి గెలుపు సూత్రం నంద్యాలలోనే 2019 ఎన్నికలో పనికిరాకపోవచ్చు.
నంద్యాల, కాకినాడలో గెలుపు ఎలా సాధ్యమైందో చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తారు. తెరవెనుక చంద్రబాబు నడిపిన మంత్రాంగం వల్లే టిడిపి గెలుపు సాధ్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. అదే మంత్రాంగం వచ్చే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లోనూ సాధ్యమవుతుందా? కచ్చితంగా చెప్పొచ్చు సాధ్యం కాదని. మరి, ఎల్లోబుక్ వల్ల ఏంటి ఉపయోగం? ఆ విషయం చంద్రబాబుకే తెలియాలి. స్ధానిక పరిస్ధితులను బట్టి ఎక్కడికక్కడ వ్యూహాలు మారిపోతుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ఒక ఉపఎన్నికలో గెలుపు సూత్రాన్నే మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లోనూ అమలు చేసి గెలిచేట్లైతే పదేళ్ళు చంద్రబాబు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చున్నట్లు? చంద్రబాబుకు ఎన్నికలు కొత్తా లేకపోతే ఉపఎన్నికల్లో పాల్గొనటం ఇదే మొదటిసారా చంద్రబాబుకు? ఏంటో మూడోసారి సిఎం అయ్యాక చంద్రబాబు ప్రతీ విషయంలోనూ ఓవర్ చేస్తున్నట్లు లేదు?
