Asianet News TeluguAsianet News Telugu

మందు బాబులకు శుభవార్త: ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. అందుబాటులోకి అన్ని రకాల బ్రాండ్‌లు

మద్యంపై పన్ను రేట్లలో (liquor rates in andhra pradesh) మార్పులు చేస్తూ మరోసారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకే మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాట్ , అదనపు ఎక్సైజ్ డ్యూటీ (excise duty) ప్రత్యేక మార్జిన్లలో హేతుబద్ధత కోసం మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. 

new liquor rates in andhra pradesh
Author
Amaravathi, First Published Dec 18, 2021, 7:04 PM IST

మద్యంపై పన్ను రేట్లలో (liquor rates in andhra pradesh) మార్పులు చేస్తూ మరోసారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకే మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాట్ , అదనపు ఎక్సైజ్ డ్యూటీ (excise duty) ప్రత్యేక మార్జిన్లలో హేతుబద్ధత కోసం మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరైటీలపై 5-12 శాతం ధరలు తగ్గే అవకాశం వుంది. అలాగే ఇతర కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ తగ్గనున్నాయి ధరలు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం... నాటుసారా తయారీని అరికట్టేందుకు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ .. ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios