చంద్రబాబుకు ప్రధాని అపాయిట్మెంట్ ఇస్తారా?

చంద్రబాబుకు ప్రధాని అపాయిట్మెంట్ ఇస్తారా?

‘ప్రధానమంత్రి అపాయిట్మెంట్ తీసుకోగానే చంద్రబాబునాయుడు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు’...ఇది టిటిడిపి ఎల్ బి నగర్  ఎంఎల్ఏ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదివారం చెప్పిన మాటలు. వినటానికే విచిత్రంగా లేదా ఎంఎల్ఏ మాటలు. ఇంతకీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని ఎందుకు వెళ్ళాలని కృష్ణయ్య అడిగారట. అంటే, బీసీ రిజర్వేషన్ల పరిష్కారం కోసమట. ఇప్పటికిప్పుడు బీసీ రిజర్వేషన్లకు వచ్చిన సమస్య ఏముంది? అదే అర్ధం కావటం లేదు. సమస్య ఏదైనా ఉంటే అది కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ అంశమే. అదికూడా కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం విషయంలోనే.

పోయిన ఎన్నికల్లో కాపులను బీసీల్లోకి చేరుస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని చంద్రబాబు విజయవంతంగా తుంగలో తొక్కేసారు. ఆచరణ సాధ్యం కాని హామీనిచ్చి చంద్రబాబు ఇరుక్కున్నారు. పైగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తుందని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే, అసెంబ్లీ తీర్మానం చేసిన రెండో రోజే గుజరాత్ ఎన్నికల్లో మాట్లాడుతూ, ‘50 శాతానికి మించిన రిజర్వేషన్లను కేంద్రం అంగీకరించద’ని స్పష్టంగా ప్రకటించారు. ‘కేంద్రం అంగీకరించినా సుప్రింకోర్టు ఆమోదించద’ని కూడా తెలిపారు. పైగా ‘ఎవరైనా 50 శాతం దాటిని తర్వాత రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినా నమ్మవద్దం’టూ పిలుపిచ్చారు. దాంతో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలయ్యే అవకాశం లేదని తేలిపోయింది.

ఇంతకీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గడచిన ఏడాదిన్నరగా ఎంత ప్రయత్నించినా చంద్రబాబును కలవటానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి అంగీకరించటం లేదు. చంద్రబాబును ఏకాంతంగా మోడి ఏడాదిన్నరగా కలిసే అవకాశం ఇవ్వలేదు. తనకు ప్రధాని అపాయిట్మెంట్ కావాలని ఎన్నిసార్లు చంద్రబాబు పిఎంవోను అడుగుతున్నా సానుకూల స్పందన కనిపించటం లేదు. అటువంటిది అఖిలపక్షాన్ని ప్రధానికి వద్దకు తీసుకెళతానని చంద్రబాబు ఇచ్చిన హామీని కృష్ణయ్య ఎలా నమ్మారో ?

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page