రాజధాని నిర్మాణ ప్రక్రియను చూస్తే చంద్రబాబు హయాంలో అసలు పునాదుల తవ్వకమన్నా మొదలవుతుందా అన్న అనుమానం వస్తోంది.
కేంద్రప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే అసలు ఏపికి ఏమైనా సాయం చేసే ఆలోచనలున్నాయా అన్న అనుమానం వస్తోంది. గడచిన రెండున్నరేళ్ళలో రాష్ట్రాభివృద్ధికి నరేంద్రమోడి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకూ ఏమన్న వచ్చిందంటే అది రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నవి మాత్రమే. వాటినే అప్పుడప్పుడు మంజూరు చేస్తూ ఏపిని తామేదో ఉద్ధరించేస్తున్నట్లు మోడి, వెంకయ్య, జైట్లీలు బిల్డప్ ఇస్తున్నారు. పైగా కేంద్రం ఏపిని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందంటూ కథలు వినిపిస్తుంటారు ప్రతీసారి.
అదే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, విశాఖపట్నం ప్రత్యేకంగా రైల్వేజోన్, రూ. 16,500 కొట్ల ఆర్ధికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు లాంటి వాటిని మాత్రం కేంద్రం ఏమీ మాట్లాడటం లేదు. ఇక, పోలవరం నిర్మాణం కూడా కేంద్రం బాధ్యతే. అయితే, చంద్రబాబు పట్టుబట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుండి లాక్కున్నారు. దాంతో నిధులు అరాకొరా వస్తున్నాయి. పోలవరం లాక్కోవటంలో చంద్రబాబుకు ఎందుకంత ఇంట్రస్టో ఆయనే చెప్పాలి. పోలవరం కోసం హోదాను వదులుకున్నారు చంద్రబాబు.
రాజధాని నిర్మాణ ప్రక్రియను చూస్తే చంద్రబాబు హయాంలో అసలు పునాదుల తవ్వకమన్నా మొదలవుతుందా అన్న అనుమానం వస్తోంది. గడచిన ఏడాదిన్నరగా డిజైన్లనీ, మాస్టర్ ప్లాన్ అని, కోర్ క్యాపిటల్ నిర్మాణమని, సిటీలనీ సాధారణ జనానికి అర్ధంకాని భాష మాట్లాడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. మంగళగిరికి సమీపంలోనో లేక ఇంకెక్కడైనా ప్రభుత్వ స్ధలంలోనే కనీసం పాలనలకు అవసరమైన భవనాలను అయినా కట్టిఉంటే మిగిలిన ప్రాంతం ఈ పాటికి అభివృద్ధి జరుగుతుండేది.
పాలనకు అవసరమైన రాజ్ భవన్, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్, హై కోర్టు తదితరాల నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. అయితే, కేంద్రం పనిని కూడా చంద్రబాబు కేంద్రాన్ని చేయనీయలేదు. కేంద్రం లెక్క ప్రకారం పై భవనాల నిర్మాణం 3 వేల ఎకరాల్లో వచ్చేస్తుంది. అందుకు మహాఅయితే రూ. 5 వేల కోట్లు వ్యయం అయ్యుండేది. అయితే, కేంద్రాన్ని తన పని దానిని చేసుకోనిస్తే ఇక్కడుండేది చంద్రబాబు ఎందుకవుతారు? చంద్రబాబు లెక్క లక్షల కోట్లు కదా? అందుకే తాను చేయలేక, కేంద్రాన్ని చేయనీక బీద అరుపులు అరుస్తున్నారు.
