ఇటీవల ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న అనేక సమస్యలకు వాస్తు ధోషమే కారణమని పండితులు చెప్పారట. అసలు వెలగపూడిలో నిర్మించిన సచివాలయ స్ధలాన్ని పలువురు వాస్తు పండితులు అనేక లెక్కలు వేసిన తర్వాతే ఎంపిక చేసారు. అయినా ఇంకా వాస్తుధోషాలేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

సచివాలయానికి వాస్తు దోషాలు వీడటం లేదు. అదేంటో మరి ఎన్నిసార్లు కొట్టి, మళ్ళీ కడుతున్నా ఇంకా వాస్తు దోషాలేంటే ఎవరికీ అర్ధం కావటం లేదు. సచివాలయానికి వాస్తు దోషాలంటూ తాజాగా గేట్లను మేసేసారు. చంద్రబాబునాయుడు సాధారణంగా మొదటి గేటు నుండి సచివాలయంలోకి ప్రవేశిస్తారు. హటాత్తుగా మంగళవారం 2వ గేటు నుండి లోపలకి ప్రవేశించటంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు.

1వ గేటు నుండి వెళ్ళాల్సిన చంద్రబాబు 2వ గేటులోపల నుండి వెళ్ళటంలో ఏదో పొరబాటు జరిగి ఉంటుందని సిబ్బంది అనుకున్నారు. అయితే, నిన్నటి నుండి 1వ గేటును తెరవలేదు. కారణాలు ఏంటాని వాకాబు చేస్తే వాస్తు బాగోలేదని 1వ గేటును మూసేసారని సిఎంఓ అధికారులు చెప్పారు. ఇక నుండి రాకపోకలకు 2వ గేటునే ఉపయోగిస్తారట. దానికితోడు సచివాలయంలోని కొన్ని గోడలను కూల్చేసి, ద్వారబంధాలను కూడా మళ్ళీ మారుస్తున్నారు.

ఇదే వాస్తు సమస్య వల్ల బ్లాకును కూడా గతంలో చంద్రబాబు మార్చేసారు. దాంతో వాస్తు పేరుతో సచివాలయంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అంతు పట్టటం లేదు. ఇటీవల ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న అనేక సమస్యలకు వాస్తు ధోషమే కారణమని పండితులు చెప్పారట. అసలు వెలగపూడిలో నిర్మించిన సచివాలయ స్ధలాన్ని పలువురు వాస్తు పండితులు అనేక లెక్కలు వేసిన తర్వాతే ఎంపిక చేసారు. అయినా ఇంకా వాస్తుధోషాలేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. తాజాగా మళ్ళీ వాస్తు సమస్యలనగానే ఇంకేముంది ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లు వాస్తు మార్పులు మొదలుపెట్టేసారు. చంద్రబాబు సిఎం అయిన దగ్గర నుండీ వాస్తు ధోషాలు వీడటం లేదేంటో.