Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియా అంటే అంత వణుకా?

వైసీపీని ఏం చేయలేకే మద్దతుగా నిలుస్తున్న సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్షతీర్చుకుంటోంది.సోషల్ మీడియాను కట్టడి చేయగలిగితే వైసీపీని నియంత్రించినట్లేనా? ఎంతటి అమాయకులో పాలకులు. సోషల్ మీడియాను మాత్రం ఏ విధంగా నియంత్రించగలరు?

Why naidus government is afraiding of social media

ప్రభుత్వంలోని డొల్లతనం స్పష్టంగా బయటపడింది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క పోస్టుకే వణికిపోతోందంటే చంద్రబాబునాయుడులో ఎంత అభద్రత ఉందో అర్ధమైపోతోంది. ఫెస్ బుక్ లోని పవర్ పంచ్ గ్రూపులో లోకేష్ కు వ్యతిరేకంగా వేసిన ఓ పంచ్ ను సాకుగాచూపించి ఇంటూరి రవికిరణ్ న్ను పోలీసులు అరెస్టు చేయటమే విడ్డూరంగా ఉంది. శాసనమండలి నేపధ్యంలో నారా లోకేష్ పై  ఓ ‘పంచ్’ వేస్తేనే అరెస్టు చేసేస్తారా? అని నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

ప్రభుత్వ చేష్టలు ఎలాగున్నాయంటే నేరుగా వైసీపీని ఏం చేయలేక ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న సోషల్ మీడియాగ్రూపుల మీద పడింది ప్రభుత్వం.  ఇదే సోషల్ మీడియా అండతో మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిపైన కుప్పలు తెప్పలుగా వేసిన కార్టూన్లు, పంచ్ లను చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఇంకా వేస్తూనే ఉన్నారు కదా? టిడిపి అధికారిక వెబ్సైట్ లో ఇప్పుడు కూడా అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూనే ఉన్న విషయం వాస్తవం కాదా? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షకోట్ల రూపాయలు దోచుకున్నారని ఇపుడు కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా?

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఉపయోగపడిన సోషల్ మీడియా ఇపుడు ప్రభుత్వంమెడకే చుట్టుకునేసరికి చంద్రబాబుకు, లోకేష్ కు మంటపుడుతోంది. ప్రభుత్వంలోని లోపాలను, చంద్రబాబు, లోకేష్ నుండి జాలువారుతున్న ఆణిముత్యాలు సోషల్ మీడియాకు రోజూ లడ్డూల్లాగా దొరుకుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు ఏకిపారేస్తోంది. అదే తండ్రి, కొడుకులకు నచ్చటం లేదు.

అందులోనూ మెజారిటీ సోషల్ మీడియా వైసీపీకి మద్దతుగా నిలవటంతో పాటు తప్పొప్పులను ప్రతిరోజు ఎత్తిచూపుతుండటంతో అసహనం పెరిగిపోతోంది. అంశం అది ఇది అని లేదు. అవకాశం వచ్చిన ఏ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వదిలిపెట్టటం లేదు. సోషల్ మీడియాను కూడా ప్రభుత్వం ప్రతిపక్షంగా చంద్రబాబు భావిస్తున్నారేమో. అందుకే సోషల్ మీడియా అంతలా రెచ్చిపోతోంది.

అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. వైసీపీని ఏం చేయలేకే మద్దతుగా నిలుస్తున్న సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్షతీర్చుకుంటోంది. ఇందులో భాగమే రవికిరణ్ అరెస్టు. సోషల్ మీడియాను కట్టడి చేయగలిగితే వైసీపీని నియంత్రించినట్లేనా? ఎంతటి అమాయకులో పాలకులు. సోషల్ మీడియాను మాత్రం ఏ విధంగా నియంత్రించగలరు?  వందలు, వేలు కాదు లక్షల్లో ఉన్నాయి సోషల్ మీడియా సైట్లు. ఎన్నింటి మీద కేసులు పెడతారు? ఎందరిని అరెస్టులు చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios