Asianet News TeluguAsianet News Telugu

ఎందుకు సోషల్ మీడియాతో  పెట్టుకుంటున్నారు?

జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకరంగా ఎన్నో పోస్టులు పెట్టినపుడు తాము ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. అప్పుడు మాత్రం ఎందుకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ఇక నుండి తానే పోస్టింగులు పెడతానని, ధైర్యముంటే చర్యలు తీసుకోవాలంటూ సవాలు విసిరారు.

Why naidu govt precipitating social media

ఎంతమంది విమర్శిస్తున్నా, వేలాదిమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఏపి ప్రభుత్వం తన వైఖరిని మర్చుకోవటం లేదు. సోషల్ మీడియాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో చంద్రబాబునాయుడు, కుమారుడు లోకేష్ పై కార్టూన్లు వేస్తున్నారని, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నరన్నది ప్రభుత్వ అభియోగం. ఇందులో భాగమే పవర్ పంచ్ గ్రూపు అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ అరెస్టు. అయితే, వివిధ వర్గాల నుండి ఎదురైన ఆగ్రహం, ఒత్తిళ్ల నేపధ్యంలో రవిని విడుదల చేసింది ప్రభుత్వం. అయితే, హటాత్తుగా శనివారం ఉదయం వైఎస్ఆర్సిపి ఐటి విభాగం కార్యాలయంపై పోలీసులు దాడులు చేయటం గమనార్హం.

అంటే ఎలాగైనా సరే వైసీపీ ఐటి విభాగాన్ని మూయించేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, జోగి రమేష్‌ తదితరులు హుటాహుటీన సోషల్‌ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు. సోదాలు చేస్తున్న పోలీసుల చర్యలకు అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా పోలీసుల సమక్షంలోనే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఫోన్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఫిర్యాదుపై మీరెలా స్పందిస్తారంటూ ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిని ఎంపి నిలదీశారు.

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకరంగా ఎన్నో పోస్టులు పెట్టినపుడు తాము ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. అప్పుడు మాత్రం ఎందుకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ఇక నుండి తానే పోస్టింగులు పెడతానని, ధైర్యముంటే చర్యలు తీసుకోవాలంటూ సవాలు విసిరారు.

అదే సమయంలో జగన్ను దూషిస్తూ మంత్రి లోకేశ్‌ పెట్టిన ట్వీట్లను వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పోలీసులకు చూపించారు. వైఎస్‌ఆర్‌ సీపీలోని అన్ని విభాగాలకు తానే ఇంఛార్జ్‌ని అని, నోటీసులు ఇవ్వదలిస్తే తనకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి అన్నారు. చర్యలు తీసుకుంటే తనపై తీసుకోవాలని ఆయన పోలీసులుతో తెలిపారు. పోలీసులు బదులిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ వింగ్‌కు చెందిన చల్లా మధుసూదన్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని, ఈనెల 24న విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు తెలిపారు.
 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios