కొత్తగా ప్రదానమంత్రి ఏర్పాటు చేసిన కమిటీలో చంద్రబాబునాయుడుకు చోటు కల్పించలేదు. ఆర్ధిక వ్యవస్ధను పరుగులు పెట్టించేందుకు మోడి కీలకమైన కమిటిని నియమిస్తూ సోమవారం ప్రకటన చేసారు. దేశ పురోగతి నెమ్మదించిందన్న అంచనాల నేపధ్యంలో మోడి ఆర్ధిక సలహాదారుల మండలిని నియమించారు. అంతా బాగానే ఉంది కానీ ఈ మండిలిలో చంద్రబాబుకు చోటు ఎందుకు లేదన్న విషయమే తమ్ముళ్ళను ఒకటే వేదిస్తోంది. నల్లధనాన్ని నియంత్రించేందుకు పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చింది చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా స్వచ్చభారత కమిటీకి కన్వీనర్ గానూ ఉన్నారు. అంతేకాకుండా పలు జాతీయ కమిటీల్లో చంద్రబాబే కీలకం. మరి అంతటి అనుభవజ్ఞుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీని మోడి ఇంతటి కీలకమైన మండలిలో ఎందుకు సభ్యత్వం కల్పించలేదో?