Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) టిడిపి ప్రచారానికి దూరంగా  సుబ్బారెడ్డి

  • అటువంటి నేపధ్యంలో మొన్నటి వరకూ ఎన్నికల్లో అంతా తానై తిరిగిన ఏవి సుబ్బారెడ్డి దాదాపు వారం రోజులుగా ఎక్కడా కనిపించటం లేదు.
  • ప్రచారంలో సుబ్బారెడ్డి ఎందుకు దూరంగా ఉంటున్నారన్న విషయం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది.
  • వారం రోజుల క్రితం సుబ్బారెడ్డి బాత్ రూంలో పడ్డారని అందుకే ప్రచారంలో ఎక్కడా  కనిపించటం లేదని టిడిపి టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
  • ఇది ఒక కారణం మాత్రమేనని తెలుస్తోంది. లోపల అసలు కారణాలు ఇంకా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.
Why av subbareddy keeping him self aloof from electioneering

నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశంపార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఏవి సుబ్బారెడ్డి ప్రచారంలో ఎక్కడా కనిపించటం లేదు. ఉపఎన్నికలో ఇద్దరి అభ్యర్ధుల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. నియోజకవర్గంలో ఎన్నికల వేడి బాగా తగులుతోంది. అటువంటి నేపధ్యంలో మొన్నటి వరకూ ఎన్నికల్లో అంతా తానై తిరిగిన ఏవి సుబ్బారెడ్డి దాదాపు వారం రోజులుగా ఎక్కడా కనిపించటం లేదు. ప్రచారంలో సుబ్బారెడ్డి ఎందుకు దూరంగా ఉంటున్నారన్న విషయం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది.

వారం రోజుల క్రితం సుబ్బారెడ్డి బాత్ రూంలో పడ్డారని అందుకే ప్రచారంలో ఎక్కడా  కనిపించటం లేదని టిడిపి టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక కారణం మాత్రమేనని తెలుస్తోంది. లోపల అసలు కారణాలు ఇంకా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అఖిలప్రియ-సుబ్బారెడ్డి మధ్య సయోధ్య లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దాని ప్రభావం ఉపఎన్నికలపై కనబడుతూనే ఉంది. వారంగా టిడిపి ప్రచారంలో సుబ్బారెడ్డి ఎక్కడా కనబడక పోవటంతో అఖిల-సుబ్బారెడ్డిల మధ్య ఏం జరుగుతోందో ప్రచారానికి వస్తున్న టిడిపి నేతలకు ఎవరికీ అర్ధం కావటం లేదు.

అసలే, అంతంతమాత్రంగా ఉన్న టిడిపి పరిస్ధితి సుబ్బారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండటంతో మరింత ఇబ్బందిగా తయారైంది. నియోజకవర్గంలో ప్రధానంగా మున్సిపాలిటి పరిధిలో సుబ్బారెడ్డికి బలమైన వర్గమే ఉంది. రేపటి పోలింగ్ లో సుబ్బారెడ్డి వర్గం టిడిపికి దూరంగా ఉన్నా లేదా లోపాయికారీగా వైసీపీకి మద్దతిచ్చినా ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లవుతుంది’ టిడిపి పరిస్ధితి. మొన్న భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కూడా సుబ్బారెడ్డికి సమాచారమే అందలేదట. అయితే చివరి నిముషంలో మంత్రి కాలువ శ్రీనివాసులు ఈ విషయాన్ని గ్రహించి సుబ్బారెడ్డితో మాట్లాడి బలవంతంగా నామినేషన్ కార్యక్రమానికి తీసుకొచ్చినట్లు సమాచారం.

ఇవన్నీ ఒక ఎత్తైతే, శిల్పా చక్రపాణి రెడ్డికి సుబ్బారెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయన్నది నిజం. రేపటి రోజున టిడిపి గనుక ఇక్కడ గెలిస్తే తనకు లాభంకన్నా నష్టమే ఎక్కువని సుబ్బారెడ్డి అనుకుంటున్నారట. ఎందుకంటే, సుబ్బారెడ్డిని మంత్రి అఖిలప్రియ దూరంగా పెట్టేసిందనే ప్రచారం బాగా జరిగింది. రేపు టిడిపి గెలిస్తే మంత్రి గానీ భూమా బ్రహ్మానందరెడ్డి గానీ సుబ్బారెడ్డిని మరింత దూరంగా పెట్టటం ఖాయం. అదే శిల్పా మోహన్ రెడ్డి గెలిస్తే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఏదో ఓ మంచి పదవి వస్తుందని ఆలోచిస్తున్నారట సుబ్బారెడ్డి. ఇటువంటి కారణాలన్నీ కలిసి సుబ్బారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని బాగా ప్రచారం జరుగుతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios