చిత్తూరు జిల్లా ఏర్పేడు త్తూరు జిల్లా ఏర్పేడు రోడ్డు మీద శుక్రవారం మధ్యాహ్నం 40 మంది పేదరైతుల రక్తం ఏరులై పారెందుకు కారణం ప్రభుత్వంలో కొనసాగుతున్న అక్రమాలే.
చిత్తూరు జిల్లా ఏర్పేడు త్తూరు జిల్లా ఏర్పేడు రోడ్డు మీద శుక్రవారం మధ్యాహ్నం 40 మంది పేదరైతుల రక్తం ఏరులై పారెందుకు కారణం ప్రభుత్వంలో కొనసాగుతున్న అక్రమాలే.
ఈ రైతులంతా అక్రమాలను నిరసిస్తూనే రోడ్డు మీద బైఠాయించారు. అపుడే తెలంగాణా మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఎరువుల దారి వీరందరి మీద దూసుకుపోయింది. 15 మంది అక్కడే లారీ చక్రాలకింద నలిగిపోయారు. మరొక 24 మంది తీవంగ్రా గాయపడ్డారు. చనిపోయినా వారిలో కొందరు లారి ఢీకొనడంతో విరిగిపోయిన కరెంటు స్తంభంతీగెలు తెగి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. వీళ్లంతా సమీపంలో మునగపాలెం వాసులు. చిన్న రైతులు, పేద రైతులు.
వీళ్లంతా ఎందుకు రోడ్డెక్కారు ?
వీరందరికి వ్యవసాయమే జీవనాధారం. వూరి పక్కపారే స్వర్ణముఖినదే వీల్ల వ్యవసాయానికి నీరందించేంది. పలుకుబడి ఉన్నోల్లు, రాజకీయం బలం, అధికారుల అండ ఉన్న ఇసుక దొంగలు నదిలోని ఇసుకనంతా తోడేసుకుపోయి ఏటిని చంపేస్తున్నారు. ఇసుక పోవడంతో నది గర్భంలో నీళ్ల నిల్వ వుండే అవకాశం లేదు. ఫలితంతా ఈ వూర్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి. వ్యవసాయం పోయింది. రాబడిపోయింది. వూరంతా ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది.
ఇక మౌనంగా ఉంటే లాభం లేదని వారంతా నడుం బిగించారు. ఇసు క మాఫియా స్వర్ణ ముఖి నదిలోకి రాకుండాచూడాలని, ఏరును కాపాడి, వూరు ను బతికించడండి వేడుకునేందుకు వారుచిత్తూరు రూరల్ ఎస్సీ జయలక్ష్మిని కలవాలనుకున్నారు. ఆమె ఏర్పేడు పోలీస్ స్టేషన్ వస్తున్నారని తెలిసి, ఈ ఇసుక దొంగతనం అరికట్టాలని ఆమెకు విజ్ఞప్తి చేసేందుకు వారంతా ఏర్పేడు కు వచ్చారు.
అయితే, తీరుబడిగా బయటకు వచ్చి, ఇసుక మాఫియా తన పరిధిలోకి రాదని, రెవిన్యూ అధికారులను కలవాలని తుర్రుమని వెళ్లిపోయారు. తమ వూర్లో జరుగుతున్న ఒక నేరం గురించిచెబితే ఎస్ఫి తన కు సంబంధం లేదని చెప్పినందుకు నిరసనగా వారు రోడ్డు మీద భైఠాయించారు.
ఈ పల్లెటూరిపేదరైతులు రోడ్డు బైఠాయించారో లేదో మృత్యు శకటం (AP26TD8679 )అటువైపు వచ్చి వాళ్ల మీదనుంచి దూసుకెళ్లి, ఒక కొంతమంది అక్కడిక్కడే నలిపేసి, చంపేసి, పక్కనున్న కరెంటు స్తంభాన్ని కూడా విరగ్గొట్టి, పొరపాటైంది, క్షమించడన్నట్లు నిలబడింది.
ప్రభుత్వం లో ఉన్న అవినీతి, లంచగొండి తనం కాదూ ఈ పేదరైతులను బలితీసుకున్నది...
అందుకేనేమో, క్షణాలమీద, చచ్చినోళ్ల కుటంబాల మీద అయిదు లక్షల ఎక్స్ గ్రేషియా రాలుస్తామని ఏలిన వారు ప్రకటించారు.
