హైదరాబాద్: రాష్ట్రంలో ఏ సీటు కోరుకొన్నా... పురందేశ్వరీకి ఇచ్చేందుకు వైసీపీ సిద్దంగా ఉన్నారని.. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని వీడడం ఇష్టం లేని కారణంగానే ఆమె బీజేపీలో ఉన్నారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు.

సోమవారం నాడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. హితేష్ చెంచురామ్  వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నందున అతడి కోసం  అవసరమైతే తాను రాజకీయాల నుండి దూరంగా ఉండాలని కూడ భావించారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు.

చెంచురామ్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్న సమయంలో ఈ విషయమై తనతో పురంధేశ్వరీ చర్చించారని చెప్పారు. ఏపీలో బీజేపీ కష్ట కాలంలో ఉందని..ఈ సమయంలో తాను పార్టీని వదిలి వెళ్లడం సరైంది కాదనే అభిప్రాయాన్ని ఆమె వెలిబుద్చారన్నారు. అయితే హితేష్ కోసం రాజకీయాలకు దూరంగా కూడ ఉండాలని భావించారన్నారు. 

అదే సమయంలో వైసీపీ నుండి  కూడ పురంధేశ్వరీకి ఆఫర్లు వచ్చాయని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. ఏ స్థానం  కోరుకొన్నా ఆమెకు ఇచ్చేందుకు కూడ వైసీపీ సిద్దంగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీని వీడేందుకు పురంధేశ్వరీ ఒప్పుకోలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అంతా దైవ నిర్ణయమే: పార్టీల మార్పుపై దగ్గుబాటి

చిన్నపిల్లాడు, ఆయనతో మాటలేమిటి: బాలకృష్ణపై దగ్గుబాటి

ఎట్టకేలకు దగ్గుబాటి చెంచురామ్ అమెరికా పౌరసత్వం రద్దు