హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణ తన వద్ద చిన్న పిల్లాడేనని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. టీడీపీలో తన పాత్ర ఏమిటో అందరికీ తెలుసునన్నారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్  విషయమై ఆయన స్పందించారు. బాలకృష్ణ నటించి నిర్మించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో తన పాత్రను తక్కువ చేసి చూపడంపై ఆయన స్పందించారు.

మహానాయకుడు సినిమాలో తన పాత్రను కొంత మేరకే చూపిన విషయమై తాను బాలకృష్ణతో చర్చించబోనని ఆయన చెప్పారు. ఇలాంటి విషయాలను బాలకృష్ణతో చర్చించే స్థాయి తనది కాదన్నారు.తన దృష్టిలో బాలకృష్ణ ఇంకా చిన్న పిల్లాడేనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు.

తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావం సమయంలోనూ, ఆ తర్వాత తన పాత్ర గురించి అందరికీ తెలుసునని ఆయన చెప్పారు. అయితే సినిమాలో ఈ విషయాలను ప్రస్తావించకపోయినా.. పార్టీలో ఉన్నవారికి అన్నీ తెలుసునని ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

ఎట్టకేలకు దగ్గుబాటి చెంచురామ్ అమెరికా పౌరసత్వం రద్దు