హైదరాబాద్: పార్టీలు మారడం, రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తిరిగి  పోటీ చేయడం వంటి పరిణామాలు దైవ నిర్ణయంతో  జరిగినవేనని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని చెప్పారు. ఏ విషయంలోనైనా మంచిని తీసుకొని చెడును వదిలేస్తానని ఆయన స్పష్టం చేశారు.

తన జీవితంలో ఏ ఘటన చోటు చేసుకొన్నా కూడ అది దైవ నిర్ణయంతో పాటు గ్రహల స్థితిగతుల వల్ల చోటు చేసుకొందని తాను భావిస్తానని ఆయన చెప్పారు.రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఐదేళ్ల తర్వాత తిరిగి పర్చూరులో పోటీ చేయడం దైవ నిర్ణయమేనని ఆయన చెప్పారు.

తన 35 ఏళ్ల రాజకీయ అనుభవం తనకు కలిసి రాలేదోమోననే ఒక్కోసారి మనోవేదనకు గురయ్యాయన్నారు. అయితే తాను ఈ దఫా పోటీ చేయాల్సిన పరిస్థితులు రావడం వెనుక దైవం ఏదో ముందుగానే నిర్ణయించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  తాను ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ వద్ద ఎలా పనిచేశానో జగన్ వద్ద కూడ అలానే పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

చిన్నపిల్లాడు, ఆయనతో మాటలేమిటి: బాలకృష్ణపై దగ్గుబాటి

ఎట్టకేలకు దగ్గుబాటి చెంచురామ్ అమెరికా పౌరసత్వం రద్దు