జ‌గ‌న్ మోహాన్ రెడ్డి ప‌ర్య‌ట‌న ను అడ్డుకొవ‌డానికి టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు ర‌హ‌స్య పిలుపునిచ్చిందా..! నంద్యాల్లో జగన్ సభ జరగకుండా టిపిడి ప్రయత్నాలు ప్రారంభించిందా...! అంటే అవున‌నే అంటున్నారు వైసీపి నేతలు.. అందుకు ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి మాట‌లు కూడా మ‌రింత ఊతమిస్తున్నాయి. 

నేడు వైసీపి కార్య‌ల‌యంలో మీడియాతో అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మాట్లాడారు. ఆయ‌న నంద్యాల‌లో వైసీపి గెలుపును ఎవ్వ‌రు అడ్డుకొలేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపి విజ‌యాన్ని అడ్డుకోవ‌డానికి టిడిపి అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ద‌గ్గ‌రి నుండి సాధార‌ణ కార్య‌క‌ర్త వ‌ర‌కు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అయినా గెల‌వ‌లేర‌ని ఆయ‌న పెర్కోన్నారు.   

నంద్యాల‌లో వైసీపి అధ్య‌క్షుడు జగన్ మోహన్ రెడ్డి పర్యటన ను అడ్డుకొవడానిక టిడిపి విశ్వ ప్ర‌యత్నాలు చేస్తున్నార‌ని క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా చంద్రబాబు టిడిపి కార్యకర్తలకు రహస్య పిలుపు నిచ్చారని ఆయన అరోపించారు. చంద్ర‌బాబు పొలీసులను చెప్పు చేతల్లొ పెట్టుకొని  ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు, వేలకొట్ల రూపాయలు డబ్బు పంచేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు సిద్దంగా  ఉన్నారని దీనిపై ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసిన నంద్యాల్లో వైసీపీ అధికారంలొ కి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

టిడిపి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల‌ల్లో రాష్ట్రం నుండి మూడున్నర లక్షల కోట్లు చంద్రబాబు దొచుకున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కాపుల కోసం ముద్రగడ పాద‌యాత్ర చేస్తుంటే చంద్ర‌బాబు ఇనుప కంచేల‌తో అణిచి వేస్తున్నారని ఈ సంద‌ర్భంగా పెర్కొన్నారు. చంద్ర‌బాబు పాల‌న‌కు ఆంధ్ర ప్ర‌జ‌లంద‌రు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని, 2019 ఎన్నీక‌ల్లో బాబు ఘోర ప‌రాజయం పాల‌వుతార‌ని, అందుకు ముంద‌స్తు హెచ్చ‌రిక నంద్యాల ఎన్నీక అని క‌రుణాక‌ర్ రెడ్డి జ్యోష్యం చెప్పారు.