అమరావతి:  విపక్షనేత చంద్రబాబు తీరును ఆక్షేపిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబునాయుడు తీరును ఆక్షేపిస్తూ తీర్మానం  చేసింది.

ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.ఈ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

పంట నష్టంపై టీడీపీ సభ్యులు  ఇవాళ స్పీకర్ పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు.ఈ నిరసనకు దిగిన టీడీపీ సభ్యులను ఇవాళ ఒక్క రోజు పాటు సభ నుండి స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

also read:కరోనాకు భయపడే నాయుడు, ఎందుకు రెచ్చిపోయాడో తెలియదు: బాబుపై జగన్ సెటైర్లు

సభలో చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరును అధికార పక్షం తప్పుబడుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.సభలో చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు దుర్మార్గం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.

దురుద్దేశ్యంతోనే సభను అడ్డుకొనే ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు చేశారని ఆయన ఆరోపించారు. సరైన సమయంలో చంద్రబాబుపై చర్యలు తీసుకొంటామని స్పీకర్ ఈ సందర్భంగా ప్రకటించారు.