విజయవాడ: దివ్యను తాను రహస్యంగా పెళ్లి చేసుకొన్నానని నాగేంద్రబాబు అలియాస్ స్వామి తెలిపారు. లాక్ డౌన్ సమయంలో తాము రహస్యంగా పెళ్లి చేసుకొన్నామన్నారు. 

విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య హత్య కేసులో సంచలన విషయాలను నాగేంద్రబాబు  అలియాస్ స్వామి వివరించారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు.

మూడేళ్ల క్రితం దివ్యతో తనకు పరిచయం ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.  దివ్య చొరవతోనే తమ మధ్య పరిచయం ఏర్పడిందన్నారు.  
మూడేళ్ల క్రితం దివ్యతో పరిచయమైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

తమ పెళ్లి విషయం దివ్య తల్లిదండ్రులకు తెలుసునని ఆయన చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత దివ్యను వారి పేరేంట్స్ తనకు దూరం పెట్టారన్నారు. అయితే ఈ విషయంలో దివ్య కూడ ఆమె తల్లిదండ్రులు చెప్పినట్టుగా విందని ఆయన గుర్తు చేసుకొన్నారు.

also read:బెజవాడలో యువతిపై కత్తితో దాడి: ఆత్మహత్మాయత్నం చేసిన యువకుడు

దివ్య తండ్రి పెద్ద లంచగొండి అని ఆయన ఆరోపించాడు. తాను కష్టాన్ని నమ్ముకొన్నానని ఆయన చెప్పారు. తమను దూరం చేయడాన్ని తట్టుకోలేకపోయినట్టుగా ఆయన తెలిపారు. 

దివ్యతో మాట్లాడేందుకు వెళ్లినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఇద్దరం కలిసి చనిపోదామని భావించామన్నారు. అయితే మరోసారి ఆలోచించాలని ఆమెకు చెప్పినట్టుగా ఆయన చెప్పారు. అయితే చనిపోదామని భావించడంతో తామిద్దరం గొంతు కోసుకొన్నామన్నారు.ఎవరి గొంతు వాళ్లే కోసుకొన్నామన్నారు. కానీ తాను స్పృహ కోల్పోయిన తర్వాత తన చేతిని ఎవరో కోశారని ఆయన చెప్పారు.