విజయవాడ: విజయవాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఇంజనీరింగ్ విద్యార్ధినిపై  కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

ఇంజనీరింగ్ విద్యార్ధిని తేజస్విని ఇంటికి వెళ్లి స్వామి అనే యువకుడు కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత తనను తాను గాయపర్చుకొన్నాడు. యువతి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెప్పారు.  ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడ్డాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో ఇవాళ ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమె గొంతుకోశాడు.ఆ తర్వాత తాను కూడ  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తన రెండు చేతులు కోసుకొన్నాడు. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు.

దివ్యతేజస్విని పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తీవ్ర గాయపడిన స్వామి కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

పెయింటర్ గా పనిచేసే స్వామి ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యువతిని వేధించేవాడు. అయితే అతని ప్రేమను ఆమె అంగీకరించలేదు. దీంతో ఇవాళ కత్తితో ఆమెపై దాడి చేసిన తర్వాత తనను గాయపర్చుకొన్నాడని స్థానికులు చెప్పారు.