Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 2019: రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం: జగన్

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  కౌలు దారి చట్టాన్ని ప్రక్షాళన చేయనున్నట్టు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.  కౌలుదారులకు కార్డులు, బ్యాంకుల్లో వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.
 

We are committed to Tenant farmers welfare says ys jagan

కాకినాడ:తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  కౌలు దారి చట్టాన్ని ప్రక్షాళన చేయనున్నట్టు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.  కౌలుదారులకు కార్డులు, బ్యాంకుల్లో వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.ఆరోగ్యశ్రీని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని జగన్ హమీ ఇచ్చారు. వెయ్యి రూపాయలు ఖర్చు దాటితే ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని జగన్ ప్రకటించారు. 

తూర్పుగోదావరి జిల్లా  కత్తిపూడిలో  ఆదివారం నాడు ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో  ఆయన మాట్లాడారు.కౌలుదార్ల రక్షణ కోసం  ప్రభుత్వం ఏం  చేసిందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలుదారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తామన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల కోసం ప్రభుత్వ పాఠశాలలను  నిర్వీర్యం చేస్తున్నాడని చంద్రబాబునాయుడుపై  విమర్శలు గుప్పించారు.  ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఫీజులను వసూలు చేస్తే  వాటిని నియంత్రించనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లను బాబు దగ్గరుండి మూయించివేస్తున్నారన్నారు. డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటనలు గుప్పించి   నిరుద్యోగులను మోసం చేస్తున్నారని  ఆయన విమర్శించారు. 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు జగన్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో  చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ది ఉందా అని  ఆయన ప్రశ్నించారు.  పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ గా మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి  దక్కిందన్నారు.పోలవరం ప్రాజెక్టు అంచనాలను మించాయన్నారు. 

రాష్ట్రంలో మద్యం దుకాణాలు లేని  గ్రామం ఎక్కడైనా ఉందా అని  జగన్ ప్రశ్నించారు. జిల్లా నుండి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా జిల్లాకు టీడీపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్  సమస్యను పరిష్కరించనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇదే తన హామీ అని ఆయన చెప్పారు. 

వెయ్యి రూపాయాలు ఖర్చులు దాటితే ఆరోగ్యశ్రీ కిందకి తీసుకురానున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. వైఎస్ఆర్ సీఎం గా ఉన్న కాలంలో ఆరోగ్య శ్రీని సమర్థవంతంగా అమలు చేసినట్టు చెప్పారు. కానీ, చంద్రబాబునాయుడు మాత్రం ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద  పేదలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. వెయ్యి రూపాయాలకు పైగా ఖర్చులు అయ్యే పరిస్థితి వస్తే .. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఆరోగ్య శ్రీ కింద వైద్య సౌకర్యం కల్పించడంతో ఎంత కాలం పాటు విశ్రాంతి తీసుకొంటే అంతకాలం పాటు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios