Asianet News TeluguAsianet News Telugu

పొంచివున్న ప్రమాదం... చంద్రబాబును హెచ్చరించిన అధికారులు

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి  అంతకంతకు పెరుగుతోంది. 

water levels raises in prakasam barrage...high alert
Author
Amaravathi, First Published Sep 28, 2020, 8:33 AM IST

విజయవాడ: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 6.66 క్యూసెక్కులుగా వుండగా అవుట్ ఫ్లో  6.61 క్యూసెక్కులుగా వుంది. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి నుంచి వెంకటాపాలెం వరకు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నివాసముంటున్న ఇంటికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇలా మొత్తం 36 నిర్మాణాలకు వరద ప్రమాదం పొంచి వుందని... కాబట్టి ఆయా నిర్మాణాల్లో వున్నవారు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు. 

ఇక వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని... వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం  లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు. 

read more  జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి: ఏపీ డీజీపికి చంద్రబాబు లేఖ

 

మరోవైపు ఈ వర్షాల కారణంగా కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు కూడా భారీ వరద కొనసాగుతోంది. గండికోట జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 16.5 టీఎంసీలుగా వుంది. అంతకంతకు నీటి నిల్వ పెరుగుతుండటంతో ముంపు గ్రామమైన తాళ్ల పొద్దుటూరు, కొండాపురం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. దీంతో తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఎస్సీ కాలనీ నీట మునిగింది. దీంతో తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరో తెలుగు రాష్ట్రమయిన తెలంగాణలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద  కొనసాగుతోంది.దీంతో మొత్తం 20 క్రస్టుగేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10గేట్లు 15ఫీట్ల మేర, 10గేట్లు 10ఫీట్ల మేర ఎత్తారు అధికారులు.  ఇన్ ఫ్లో మరియు అవుట్ ఫ్లో కూడా 4,10,978 క్యూసెక్కులుగా వుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ312.0450 టీఎంసీలుగా వుంది.  

 
 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios