మహానాడు: అమరావతి టీడీపీ ఆఫీసుకు కోవిడ్ నోటీస్
తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కోవిడ్ నోటీసు జారీ చేశారు. టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో మంగళగిరి తాహసిల్దార్ పేర ఆ నోటీసు జారీ అయింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయానికి రెవెన్యూ అధికారులు బుధవారం కోవిడ్ నోటీసు జారీ చేశారు. టీడీపీ మహానాడు జరుగుతున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసులో తెలిపారు.
ఆ మేరకు మంగళగిరి తాహిసిల్దార్ పేర టీడీపీ కార్యాలయానికి నోటీసు జారీ అయింది. ఆత్మకూరు విఆర్వో వెంకటేష్ ఆ నోటీసును టీడీపీ కార్యాలయ కార్యదర్శఇకి రమణకు అందజేశారు.
Also Read: అందుకే విశాఖ సందర్శించలేకపోయా: మహానాడులో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు రెండు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం మహానాడును టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. తొలుత కరోనా వైరస్ గురించి తాను మాట్లాడితే ఎగతాళి చేశారని ఆయన వైసీపీని ఉద్దేశించి అన్నారు. పారాసిటమాల్ వాడాలి వంటి వ్యాఖ్యలతో కరోనాను తీవ్రంగా పట్టించుకోలేదని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు.
Also Read: ఎట్టకేలకు పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పిన చంద్రబాబు
అమరావతిలోని మహానాడుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నారా లోకేష్, బొండా ఉమామహేశ్వర రావు, పట్టాభి తదితరులు హాజరయ్యారు.