ఏపీలో వీఆర్ఏల వేతనం పెంపు

VRAs Salary Hicked by AP Government
Highlights

ఏపీలో వీఆర్ఏల వేతనం పెంపు

వీఆర్ఏల వేతనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది.. ఇప్పటి వరకు నెలకు రూ.6 వేలుగా ఉన్న వేతనాన్ని రూ.10,500లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు ఈ నెల 2 నుంచి అమల్లోకి రానున్నాయి. చాలీచాలనీ జీతాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీఆర్ఏ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు మొర పెట్టుకోవడంతో.. స్పందించిన ఆయన వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు.. సీఎం ఆదేశాల మేరకు ఇవాళ వేతనాలు పెంచుతూ జీవో విడుదలయ్యింది.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు.

loader