Vizag steel plant protest : విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు.. నేడు భారీ ధర్నా
కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల రుణ భారాలు అధికమవుతున్నాయనీ, ఆయా సంస్థలు అప్పుల్లోకి జారుకుంటున్నాని పేర్కొటూ.. పలు సంస్థలను ప్రయివేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ... కొనసాగుతున్న కార్మిక పోరాటం 300 రోజులకు చేరింది. Vizag steel plant వద్ద బుధవారం భారీ ధర్నా చేయడానికి కార్మికులు సిద్ధమయ్యారు.
రుణ భారం అధికం కావడంతో పాటు అప్పుల్లోకి జారుకుంటున్నాయనే కారణాలు చూపుతూ కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోంది. వాటిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ Vizag steel plant కోసం కార్మికులు, రాష్ట్ర ప్రజలు పోరాటం సాగిస్తున్నారు. నేటితో (బుధవారం నాటికి) స్టీల్ ప్లాంట్ కార్మిక పోరాటం 300 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలోనే కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసిస్తూ సాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృత చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. కేంద్రం Vizag steel plant ప్రయివేటీకర నిర్ణయం తీసుకున్న జనవరి 27 నుండి కార్మికలు, రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రైతు ఉద్యమంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది?
Vizag steel plant ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. 300 రోజులకు ఉద్యమం చేరిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దీనిని ఉధృతం చేయనున్నట్టు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా నేడు Vizag steel plant వద్ద భారీ ధర్నా నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే అక్కడి పలు సంఘాల నాయకులతో పాటు కార్మికులు చేరుకుంటున్నారు. గాజువాక వద్ద భారీ ధర్నా నిర్వహించి Vizag steel plant కోసం తమ డిమాండ్లను కేంద్రానికి వినిపిస్తామన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు Vizag steel plant ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం సాగుతుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దీని కోసం రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగే విషయంపై చర్చలు జరుగుతున్నాయని పలువురు నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికే బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు సVizag steel plant కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: రైతు ఉద్యమంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణయం తీసుకోనుంది?
అయితే, Vizag steel plant ఉద్యమ ప్రారంభంలో రాజకీయ పార్టీలు కార్మికులతో కలిసి వచ్చాయి. ప్రస్తుతం ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ వైకాపా మొదటి నుంచి Vizag steel plant ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తోంది. Vizag steel plant కార్మికుల ఉద్యమానికి మద్దతు సైతం ప్రటించింది. అయితే, పార్లమెంట్ లో ఈ విషయం లేవనెత్తి.. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంపై వైకాపా నేతల విఫలమయ్యారని కార్మిక, ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు, ప్రజా సంఘాలు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి రాస్తారోకోలు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. అయితే, కేంద్ర మాత్రం Vizag steel plant ప్రయివేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు పంపుతున్నది. పార్లమెంట్‌లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
Also Read: హార్న్‌బిల్ ఫెస్టివల్ రద్దు.. AFSPAను రద్దు చేయాలంటూ డిమాండ్
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ సైతం Vizag steel plant ప్రయివేటీకరణ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. జనసేన సైతం ఈ ఉద్యమానికి సై అంది. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక పోరాటానికి మద్దతు ప్రకటించడంతో పాటు వారి వద్దకు వెళ్లి సంఘీభావం సైతం తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ.. Vizag steel plant ను ప్రయివేటీకరించ వద్దని కేంద్రాన్ని కోరారు. జగన్ ప్రభుత్వం సైతం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నిర్ణయం మార్చుకోవాలని లేఖలో కోరింది. రాష్ట్రమంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే, ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ముందుకు నడుస్తుంటే కేంద్రం మాత్రం Vizag steel plant ప్రయివేటీకరణకు నిర్ణయంలో మార్పు లేదంటూ స్పష్టం చేసింది. Vizag steel plant ప్రయివేటీకరణ బదులుగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశించాల్సిన అవరాన్ని సీఎం జగన్ పేర్కొన్నారు.
Also Read: భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భరద్వాజ్‌కు ఊరట