వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ముగ్గురుని శుక్రవారం తెల్లవారుజామున కడప జైలునుంచి భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ : వైసీపీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ లను తెల్లవారుజామున కడప జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్కు తరలించారు. కడప జైలులో ఉన్న నిందితులను ఈ మేరకు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు హైదరాబాద్ కు తరలించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాదులో ఉన్న సిబిఐ కోర్టులో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వీరిని హాజరు పరచనున్నారు.
నిందితులు ముగ్గురిలో సునీల్ కుమార్ యాదవ్ ఏ2, ఉమాశంకర్ రెడ్డి ఏ3, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి ఏ5లుగా ఉన్నారు. ఈ కేసులో వీరితోపాటు ఏవన్ గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉన్నాడు. అప్రూవర్ గా మారిన ఏ4 దస్తగిరి కూడా బెయిల్ మీదే ఉన్నారు. దీంతో వీరిద్దరూ ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు వివేకానంద రెడ్డి కూతురు సునీత విజ్ఞప్తి మేరకు ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులందరూ శుక్రవారం హైదరాబాదులోని సిబిఐ కోర్టులో హాజరుకానున్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. విశాఖలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు మృతి...
శుక్రవారం సిపిఐ కోర్టులో హాజరుకావాలన్న కోర్టు ఆదేశాల మేరకు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలకు కూడా సిబిఐ సమన్లు జారీ చేయడంతో వారు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలను భారీ ప్రత్యేక బందోబస్తు మధ్య హైదరాబాదుకు పోలీసులు తరలించారు. దీనికి సంబంధించిన సన్నాహాలు గురువారంనుంచే మొదలయ్యాయి. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకే జైలు అధికారులు ఈ నిందితులను హైదరాబాదుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసు: నిజానిజాలు త్వరలోనే బయటపడే అవకాశం.. దస్తగిరి కీలక కామెంట్స్
ఏఆర్ సిబ్బంది భద్రతతో నిందితులను హైదరాబాదుకు తీసుకురావాలి. అయితే రాత్రి 10:40 నిమిషాల వరకు కూడా ఆ ముగ్గురు జైలులోనే ఉన్నారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం అతడిని మూలాఖాత్ లో కలిశారు. ఆ సమయంలో తెలిసిన సమాచారం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాట్లుగా తెలిసింది. ఇక సిబిఐ కోర్టులో నిందితుల విచారణ తర్వాత వీరిని ఇక్కడే తెలంగాణ జైలులో ఉంచుతారని తెలుస్తోంది.
