ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, నెల్లూరుల్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. 

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. మొదటి ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లా వెంకోజి పాలెం జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో టు వీలర్ ను ట్రాలర్ గుద్దింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియడంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురిని దుర్గా ప్రసాద్, సాయి, గోపిలుగా గుర్తించారు. 

రోడ్డు ప్రమాదం మృతికి సంబంధించిన సమాచారాన్ని ఈ ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులకు పోలీసులు అందించారు. ఆ తర్వాత ఈ ముగ్గురు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. కుమారుల మృతదేహాలను చూసి ఆ తల్లిదండ్రుల రోధన మిన్నంటుతోంది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. 

ఏపీలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా మణుగూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వోల్వో బస్సు ఆటోను ఢీ కొట్టింది. కాగితాలపూరు వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు నెల్లూరులో డయాలసిస్ చేయించుకుని తిరిగి తమ ఊరికి వెళుతున్నారు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. 

చంద్రబాబును ఉరి తీయాలి .. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతులను నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, శీనయ్యలుగా గుర్తించారు.