విశాఖపట్నం: డైనమిక్ సిఎం జగన్మోహనరెడ్డి విధానాలు నచ్చే 13సంవత్సరాల సుదీర్ఘంగా కొనసాగిన పార్టీని కాదని వైసిపీలోకి రావడం జరిగిందని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు.  కాంగ్రెస్, టీడీపీ పాలనతో పోలిస్తే సముద్రం అంత చేంజ్ ఈ ప్రభుత్వంలో కనిపించిందన్నారు. ప్రస్తుతం మంచి గవర్నెన్స్ చూస్తున్నానని... టీడీపీ రూలింగ్ లో చేయాలనుకున్నవి కూడా ఇక్కడ జరిగిపోతున్నాయన్నారు. 

''పేదవాడి కోసమే రాజకీయ నాయకులు పని చేస్తారు. 14నెలల్లో వైసిపి ప్రభుత్వం 59వేల కోట్లు సంక్షేమానికి ఖర్చుచేసింది. కానీ టిడిపి మాత్రం వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగితే మనసు చంపుకుని పాల్గొన్నారు. ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకంగా పని చేయాలి. కానీ టిడిపి మాత్రం ప్రభుత్వ అభివృద్ది పనులకు అడ్డు పడటం తప్ప మరొక పని చేయడం లేదు. అభివృద్ధిని అడ్డుకుంటే పాపం తగులుతుందని నా నమ్మకం'' అంటూ టిడిపిపై విమర్శలు గుప్పించారు. 

''ప్రొటోకాల్ ప్రకారం తనకు ఏ పనులు అప్పగిస్తే ఆ పనులు చేస్తాను. విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో చాలా వాగ్దానాలు చేశాను. ఆ పనులు టీడీపీలో వుండి చేయలేక పోయాను. కానీ ఇప్పుడు ఏ క్షణమైనా ఫోన్ చేసి పనులు చేయించుకు వెళ్లమని ముఖ్యమంత్రి చెప్పారు'' అని తెలిపారు. 

read more  అనర్హత పిటిషన్‌కైనా, ఎన్నికలకైనా సిద్ధమే: టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్

''క్షేత్ర స్థాయి నుంచి కష్టపడి ఎదిగాను. టిడిపిలో బ్లడ్ పెట్టి పని చేశాను. కానీ ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయమని అధిష్ఠానం ఒత్తిడి చేసింది. అందుకే పార్టీ వీడాను. పేదరికం నిర్మూలనకు వైసిపీ పూర్తి స్థాయి లో పని చేస్తుంది. టీడీపీకి మనుగడ లేదు. 2050వరకూ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా వుంటారు. వైసిపీ కి ప్రత్యామ్నాయ పార్టీ లేదు. వ్యక్తి గత అవసరాల కోసం కాదు.... ప్రజల కోసమే వైసిపిలోకి వెళ్లాను'' అని గణేష్ వెల్లడించారు. 

''పేదవాడి కోసం ఆలోచన చేశాను. టీడీపీ వారిని ఎవ్వరినీ తన వెంట రమ్మని పిలవలేదు. నాపైనా ఎలాంటి ఫోర్స్ లేదు. నేను రాజీనామా చేయడానికి సిద్ధం. సాంకేతిక కారణాల దృష్ట్యా ఖండువా కప్పుకోలేదు. పిల్లలకి మాత్రం సీఎం చేత వైసిపి కండువా కప్పించి పంపించాను'' అన్నారు. 

''అమ్మ ఒడి, ఆదరణ, ఆసరా, వాహన మిత్ర, వైయస్ ఆర్ చేయూత పథకాలకి ఆకర్షితుడనయ్యాను. పేదల భవిష్యత్తే నా భవిష్యత్తు. ఇకపై సున్నా నుంచి మరలా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేస్తాను'' అని పేర్కొన్నారు. 

''విశాఖ అభివృద్ధి చెందకూడదా? అమరావతి పేరు తో కొంచెం మంది గొప్ప వారికే ప్లాట్ ఫామ్.  అమరావతి కి సమ్మతి అని టీడీపీ అధిష్ఠానం లేఖ విడుదల చేయడమే తనను ఇబ్బంది పెట్టింది. తనను నమ్ముకున్న అందరికీ న్యాయం జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు అంటే అభిమానం వుంది. పార్టీలు వేరు. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు వున్నాయి. వాటికి అనుగుణంగా నడుచుకుంటాను. పార్టీ విదానాలు నచ్చకే టిడిపిని వీడాను. నేను పార్టీ ద్రోహిని అయితే టీడీపీ పేదల ద్రోహి అవుతుంది'' అని గణేష్ అన్నారు.