గొప్పలు చెప్పుకోవడం ఓ తల్లీకొడుకుల ప్రాణాల మీదికి తెచ్చింది. తమ వద్ద రూ.30 లక్షలు, బంగారు నగలు ఉన్నాయని చెప్పడంతో ఇద్దరు వ్యక్తులు వాటిని కాజేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని చంపేశారు.
ఇటీవల విశాఖపట్నంలో జిల్లాలో తల్లీ కొడుకుల హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మీడియాకు మంగళవారం వివరించారు.
అక్కిరెడ్డి పాలెంకు చెందిన 32 ఏళ్ల ఎస్ చైతన్య గత సంవత్సరం ఓ రెస్టారెంట్ పెట్టాడు. అది సరిగా నడవకపోవడంతో రూ.16 లక్షల వరకు లాస్ అయ్యాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో అతడు మదీనా బాగ్ కు షిప్ట్ అయ్యాడు. ఈ సమయంలో అక్కడే ఉంటున్న 32 ఏళ్ల కిశోర్ బాబుతో పరిచయం అయ్యింది. అతడు గుంటూరుకు చెందినవాడు. అయితే ఆ ప్రాతంలో ఉండే ఓ వైన్స్ దగ్గర తినుబండారాలు అమ్మే గౌరమ్మ, ఆమె కొడుకు పోలారెడ్డిలకు వీరికి పరిచయం అయ్యింది.
మతిపోగొడుతున్న యాంకర్ శ్రీముఖి సంపాదన... ఒక్క సైమా ఈవెంట్ కి అన్ని లక్షలు తీసుకుందా!
వీరిద్దరు మద్యం తాగేటప్పుడు ప్రతీ రోజు తల్లీకొడుకులతో ముచ్చటించేవారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో గౌరమ్మ వారికి లేనిపోని గొప్పలు చెప్పింది. తన వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని, అలాగే కొంత బంగారం కూడా ఉందని చెప్పింది. తాను ఓ ఇళ్లును కూడా కొంటానని తెలిపింది. ఈ విషయాలు విన్న చైతన్య, కిశోర్ లు.. తల్లీ కొడుకుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని నమ్మారు. వాటిని తీసుకోవాలని ప్రయత్నించారు. తనకు ఆరు లక్షలు బాకీగా ఇవ్వాలని చైతన్య గౌరమ్మను అడిగాడు. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. అయితే తన వద్ద ఒక ప్లాట్ ఉందని, దానినైనా కొనాలని సూచించాడు. దీనికి కూడా ఆమె నిరాకరించింది.
గౌరమ్మ వద్ద ఉన్న నగదును ఎలాగైనా తీసుకోవాలని భావించిన అతడు కిశోర్ తో కలిసి ప్లాన్ వేశాడు. వారం రోజుల కిందట (సెప్టెంబర్ 7వ తేదీ) పోలారెడ్డితో కలిసి గౌరమ్మ కుమారుడు పోలారెడ్డితో కలిసి వీరిద్దరు వైన్స్ వద్ద మద్యం సేవించాడు. మిగిలిన మందు ఇంట్లో తాగుదామని రెండు బుల్లెట్ బైక్ లపై పోలారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పోలారెడ్డికి మస్కట్ లో ఉంటున్న సోదరి వీడియో కాల్ చేసింది. మధ్యలో కాల్ కట్ అవ్వడంతో చైతన్య ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడారు. ఈ సమయంలో వీరిద్దరినీ అతడు పరిచయం చేశాడు.
తాగడం పూర్తయిన తరువాత పోలారెడ్డిని కిశోర్, చైతన్యలు హత్య చేశారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన గౌరమ్మ ను కూడా హత్య చేశారు. ఇంట్లో డబ్బులు వెతకగా కేవలం రూ.2 వేలు కనిపించాయి. బీరువాలో రోల్డ్ గోల్డ్ నగలు కనిపించాయి. అయితే వాటిని నిజమైన నగలుగా భావించారు. అనంతరం ఆ నగలను తీసుకొని చెన్న్పై పారిపోయారు. ఈ రెండు హత్యలు ఆ ప్రాంతంలో కలకలం రేకెత్తించాయి.
తల్లి మృతి చెందిందనే వార్త తెలియడంతో మస్కట్ లో ఉన్న ఆమె కూతురు ఇంటికి తిరిగి వచ్చింది. తను వీడియో కాల్ చేసినప్పుడు పోలారెడ్డి పక్కన ఇద్దరు కొత్త వ్యక్తులు చూశానని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో పాటు బుల్లెట్ బైక్ లను చూశానని గౌరమ్మ చిన్న కోడలు కూడా పోలీసులకు వెల్లడించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
