విశాఖ జిల్లాలో విద్యార్ధుల డ్రగ్స్ దందా: ముగ్గురు అరెస్ట్

విశాఖ జిల్లాలోని వాల్తేరులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 54 గ్రాముల డ్రగ్స్ ను సీజ్ చేశారు. 
 

Visakhapatnam Police Arrested Three For Drugs supply

విశాఖపట్టణం: Visakhapatnam జిల్లాలోని Waltairలో విద్యార్ధులు Drugs దందా నిర్వహిస్తున్నారు.Banglore నుండి డ్రగ్స్  తీసుకొచ్చి విద్యార్ధులు విక్రయిస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు.  

స్పటిక రూపంలో ఎండీఎంఏను అక్రమంగా రవాణా చేస్తున్నారు. 54 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం  క్రిస్టల్ రూపంలో ముగ్గురు నిందితులు సరఫరా చేస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులతో ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.  నగర శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత  మూడు మాసాల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టైన వారికి  ప్రస్తుతం అరెస్టైన వారికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తీసుకొస్తూ  విశాఖలో నిందితులు పట్టుబడ్డారు

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుండి తెలుగు రాష్ట్రాలతో  పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతుంది

ఈ ఏడాది జనవరి మాసంలో  విశాఖలో ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి డ్రగ్స్ సీజ్ చేశారు.   ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్వ, విశాఖకు చెందని హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. 

గత ఏడాది నవంబర్ మాసంలో  బెంగుళూరు నుండి కొకైన్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  కాలేజీ విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ తె్తున్నారని పోలీసులు గుర్తించారు. ఓ రౌడీషీటర్  డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు అధికంగా నమోదౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైద్రాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిఘాను పెట్టింది.  తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే  నార్కోటిక్ వింగ్ ను ఏర్పాటు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios