Asianet News TeluguAsianet News Telugu

విశాఖ: వైసిపి రౌడీలు దాడిచేసారంటూ... అర్థరాత్రివరకు జనసేన వీర మహిళల ఆందోళన (వీడియో)

విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఖాళీగావున్న రెండు డివిజన్లలో సోమవారం ఉపఎన్నిక జరిగి విషయం తెలిసిందే. పోలింగ్ సమయంలో వైసిపి రౌడీలు జనసేన వీరమహిళలపై దాడికి తెగబడ్డారని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు.

visakhapatnam bypoll... janasena women leaders protest at maharanipet police station
Author
Visakhapatnam, First Published Nov 16, 2021, 11:03 AM IST

విశాఖపట్నం: సోమవారం ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయితీలతో పాటు విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ లోని రెండు డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే విశాఖలోని 31వ డివిజన్లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమ సమాజం స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద వైసీపీ, జనసేన కార్యకర్తలు మధ్య గొడవ జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. 

అయితే అధికార YSRCP నాయకులు మహిళలని కూడా చూడకుండా Janasena వీరమహిళలపై దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన మహిళా నాయకులపై దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాణిపేట పోలీస్ స్టేషన్ వద్ద జనసైనికులు, వీర మహిళలు ఆందోళనకు దిగారు. 

వీడియో

అర్ధరాత్రి 12:30 వరకు పోలీస్ స్టేషన్ వద్దే జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. అయినప్పటికి పోలీసులు స్పందించకపోవడంతో విశాఖ పోలీస్ కమీషనర్ బంగ్లాకు వెళ్లడానికి సిద్దమయ్యారు. స్వయంగా vizag police commissioner కే తమ ఫిర్యాదు అందజేస్తామని పోలీసులకు తెలపడంతో పోలీసులు స్పందించినట్లు జనసేన నాయకులు తెలిపారు. 

అర్థరాత్రి కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేయలేమని... మంగళవారం ఉదయమే వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారని ఆందోళనకు దిగిన జనసైనికులు తెలిపారు. వీరమహిళలపై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయకపోతే స్వయంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీ స్టేషన్ ముందు ఉంటాడని ఆ పార్టీ నాయకులు పోలీసులను హెచ్చరించారు. 

read more  కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత

ఇదిలావుంటే సోమవారం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీతో మరికొన్ని చోట్ల కూడా ఎన్నికలు జరిగాయి. అయితే అందరి దృష్టి మాత్రం kuppam municipal election పైనే నిలిచింది. TDP కి కంచుకోటలాంటి కుప్పంలో గెలిచి చంద్రబాబు పని ఇక అయిపోయిందని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని వైసిపి భావిస్తోంది. అయితే అధికార పార్టీ అక్రమాలను అడ్డుకునీ మరీ కుప్పంలో గెలిచి సత్తా చాటామని నిరూపించుకోవాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఇలా అధికార ప్రతిపక్షాలు కుప్పం మున్సిపల్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అధికార అండతో ysrcp నాయకులు కుప్పంలో దొంగఓట్లు వేయించారని టిడిపి ఆరోపిస్తోంది. పోలింగ్ సందర్భంగా ఇతరప్రాంతాల నుండి వచ్చిన కొందరు అనుమానాస్పదంగా వివిధ పోలింగ్ కేంద్రాలవద్ద కనిపించారని... ఈ క్రమంలోనే కొందరు దొంగఓట్లు వేయడానికి ప్రయత్నించగా పోలింగ్ కేంద్రాల్లోని ఏజెంట్లు గుర్తించారని టిడిపి చెబుతోంది.  ఇలా 18, 19వార్డుల్లో దొంగ ఓట్లు వేస్తుండగా గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు టిడిపి నాయకులు తెలిపారు. 

అయితే దొంగఓట్లు వేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అప్పగించినా పోలీసులు వారిని విడిచిపెట్టారంటూ టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతోనే దొంగఓట్లు వేయడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ఏం చేయలేకపోయారని టిడిపి ఆరోపిస్తోంది. 
 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios