Asianet News TeluguAsianet News Telugu

కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత

కడప జిల్లాలోని కమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా సోమవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి చెందిన స్థానికేతరులను అనుమతించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు.

Tension prevails after Tdp leaders House arrest at Kamalapuram in Kadapa district
Author
Kadapa, First Published Nov 15, 2021, 3:55 PM IST


కడప: కడప జిల్లాలోని కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో సోమవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. వైసీపీకి చెందిన స్థానికేతరులను  అనుమతించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12  మున్సిపాలిటీలకు ఇవాళ ఎన్నికలు జరగుుతన్నాయి. ఇందులో భాగంగా కమలాపురం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ రోజున వైసీపీకి చెందిన స్థానికేతరులను అనుమతివ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు స్థానిక టీడీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. kamalapuram మున్సిపల్ ఎన్నికల్లో  దొడ్డిదారిన గెలుపు సాధించేందుకు వైసీపీ నేతలు ఈ ప్రయత్నాలు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతం‌చర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. నిన్ననే  గతంలో కొన్ని కారణాలతో ఎన్నికలు జరగని గ్రామ పంచాయితీలకు పోలింగ్ ముగిసింది.  కుప్పం గ్రామ పంచాయితీకి సమీపంలోని  గ్రామాలను కలిపి కుప్పం గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఏర్పాటైన తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి.

kuppam మున్సిపాలిటీని కైవసం చేసుకొనేందుకు tdp, ycpలు  ప్రయత్నాలు చేస్తున్నాయి. కుప్పంలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజంయం సాధించింది. చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ వ్యూహా రచన చేస్తోంది. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో వైసీపీ జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కుప్పంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు వ్యూహా రచన చేస్తున్నారు.

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  సోమవారం  కుప్పం నేతలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దొంగ ఓట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్రమాలపై ఆధారాలు సేకరించి వీడియోలు బయటపెట్టాలని సూచించారు. పోలింగ్‌ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా శ్రేణులు పని చేయాలని తెలిపారు.
 

also read:చంద్రబాబు కుప్పం కోట బద్దలైంది: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

ap local body ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. విపక్షాలకు నామ మాత్రం సీట్లే దక్కాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని టీడీపీ ప్రకటించింది. అయితే పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ కొందరు టీడీపీ నేతలు కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసినా కూడా ఆ పార్టీకి ఆశించిన విజయాలు దక్కలేదు.కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించడం కోసం రెండు పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.  వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అయితే ఓడిపోతారని ముందే తెలిసి సాకులు వెతుక్కొంటున్నారని టీడీపీ నేతలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చురకలంటించారు.కుప్పంలో విజయం సాధించేందుకు తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ తప్పుడు కేసులు బనాయిస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios