విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథంపై ఉన్న మూడు సింహాల ప్రతిమల చోరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రథంపై ఉన్న సింహాల ప్రతిమలను దొంగలు స్క్రూలు విప్పి తీసుకెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగో రథం స్క్రూల్ రాకపోకవడంతో ఆ విగ్రహాన్ని పెకిలించే ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగో విగ్రహాన్ని రథం నుండి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతోనే నిందితులు విగ్రహాన్ని వదిలి  వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

also read:దుర్గగుడి రథంపై వెండి సింహాల ప్రతిమల మాయం: కీలక విషయాలు గుర్తింపు

2002లో ఈ రథాన్ని తయారు చేశారు. ఉగాది సమయంలో రథాన్ని బయటకు తీస్తారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది రథాన్ని బయటకు తీయలేదు.ఈ రథంపై ఉన్న సింహాల ప్రతిమలు చోరీకి గురైనట్టుగా ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాత నేరస్తులు ఈ  విగ్రహాల ప్రతిమలను చోరీ చేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీ ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ రచ్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996లో కనకదుర్గ ఆలయంలో చోరీకి గురైంది. ఆ సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విషయమై  అప్పట్లో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది.