విజయవాడ: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఏబీ వెంకటేశ్వరరావు వల్లే టీడీపీ ఏపీ రాష్ట్రంలో ఘోరంగా ఓటమి పాలైందని కేశినేని నాని  ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి రావడానికి, మీరు ముఖ్యమంత్రి కావడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు.

Also read:మానసికంగా ఇబ్బంది లేదు, చట్టపరమైన చర్యలు: ఏబీ వెంకటేశ్వరరావు

ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఓటమికి కారణమైన ఏబీ వెంకటేశ్వరరావును సన్మానం చేస్తారని భావిస్తే సస్పెండ్ చేశారేమిటీ అంటూ జగన్‌ను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో  ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్టుగా  ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ కారణంగానే  ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది ప్రభుత్వం. 

చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో ఇంటలిజెన్స్ ఏపీ చీఫ్ గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా పనిచేశారని ఆ సమయంలో  వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసింది.