మేయర్ అభ్యర్థి, ఎంపీ పరిస్థితే ఇలా వుంటే...: కేశినేని శ్వేత

 ఒకే ఇంటిలో ఉన్న వారి ఓట్లను వేర్వేరు పోలింగ్ స్టేషన్లల్లో వేశారని విజయవాడ టిడిపి మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ఆరోపించారు. 

vijayawada mayor candidate kesineni swetha cast his vote

విజయవాడ: డివిజన్లను రీ-డ్రాయింగ్ చేయడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని... ఒకే ఇంటిలో ఉన్న వారి ఓట్లను వేర్వేరు పోలింగ్ స్టేషన్లల్లో వేశారని విజయవాడ టిడిపి మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ఆరోపించారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తన కుటుంబమేనని... ఒకే ఇంట్లో వుంటున్న తన ఓటు ఒక చోట, నాన్నది, అమ్మది వేర్వేరు చోట్ల ఉన్నాయని శ్వేత తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం శ్వేత మాట్లాడుతూ... టిడిపి అభ్యర్థులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైసీపీ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీద మీదకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో టీడీపీ గెలుపు అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని శ్వేత ఆరోపించారు. 

read more  ఉద్రిక్తత... ప్రొద్దుటూరులో వైసిపి, టిడిపి అభ్యర్థుల గృహనిర్బంధం

ఇక విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అధికార వైసీపీ నేతల అరాచకాలు మితిమీరుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను రక్తసిక్తం చేస్తున్నారని... దాడులు, దౌర్జన్యాలతో ప్రజలు ఓటు వేసేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారన్నారని అన్నారు.  8వ డివిజన్  వైసీపీ అభ్యర్థి  కొత్తపల్లి రజనీ భర్త  కొత్తపల్లి రాజశేఖర్ తెలుగు దేశం పార్టీ సానుభూతి పరులపై దాడికి పాల్పడ్డారన్నారు. 

''దేవినేని అవినాశ్ ప్రోద్బలంతో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి పోలింగ్ శాతం పెరగకుండా చేయడం అత్యంత హేయం. 59వ డివిజన్ పోలింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నిసా కుమారులు దాదాగిరి చేస్తూ ఓటర్లను భయపెడుతున్నారు. ఫ్యాన్ కు ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. పసుపు రంగు చొక్కాతో వచ్చాడనే నెపంతో ఓ పౌరుడిపై దాడికి పాల్పడ్డారు. 59వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సుల్తానా కుటుంబ సభ్యులంతా జనరల్ ఏజెంట్ పాస్ తో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసి.. రక్త సిక్తం చేస్తున్న వైసీపీ అనుచరులపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios