ఉద్రిక్తత... ప్రొద్దుటూరులో వైసిపి, టిడిపి అభ్యర్థుల గృహనిర్బంధం

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి వర్గీయుల మధ్య పోలింగ్ కేంద్రం వద్దే వాగ్వాదం చోటుచేసుకుంది. 

YCP TDP Candidates house arrest at proddutur

కడప: ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఇవాళ(బుధవారం) పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి వర్గీయుల మధ్య పోలింగ్ కేంద్రం వద్దే వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా అవాంఛనీయ ఘటనలు జరక్కుంగా పోలీసులు ఇరువర్గాల చెదరగొట్టారు. అంతేకాకుండా 12వ వార్డు టిడిపి, వైసిపి అభ్యర్థుల గృహనిర్బంధం చేశారు. ఈ ఘటనదృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇక రాష్ట్రంలో ఇవాళ ఉదయమే మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది.

video   వీల్ చైర్లో ఓటేయడానికి... వృద్దురాలిని అభినందించిన ఎస్ఈసి నిమ్మగడ్డ

12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా  పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఆ నాలుగు పట్టణాల్లో పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది. 

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో సందిగ్ధత తొలగిపోయింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు/డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios