vijaya sai reddy: మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. రాష్ట్ర పెండింగ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ

vijaya sai reddy: వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా కొన‌సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాలు (Pending AP Issues) చ‌ర్చించారు. వీటిలో ప్ర‌ధానంగా రాష్ట్ర పెండింగ్ స‌మ‌స్య‌ల‌తో పాటు తాజా అంశాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. 

Vijayasai Reddy Briefs PM Modi on Pending AP Issues

vijaya sai reddy: వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో గురువారం నాడు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా కొన‌సాగిన ఈ స‌మావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలతో (Pending AP Issues) పాటు రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవెనెత్తిన పలు సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌ధానిని విజ‌సాయ రెడ్డి కోరారు.  అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు  గతంలో ఇచ్చిన విభజన హామీల్ని అమలు చేసేందుకు కృషిచేయాలని కోరారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌రణ అంశం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది.  దీనికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తూ విజ‌య సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ప్ర‌ధాని మోడీతో దిగిన ఫొటోల‌ను సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. 

Also Read: Omicron: ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే ఎక్కువే .. జ‌పాన్ సైంటిస్టులు ఎమ‌న్నారంటే?

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న సందర్బంగా ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప‌లు హామీలు ఇవ్వ‌బ‌డ్డాయి. వాటిలో ప్ర‌ధాన‌ హామీలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా క‌ల్పించ‌డం, రైల్వే జోన్ పై  కేంద్రం వెన‌క్కి త‌గ్గింది. వీటికి సంబంధించిన రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక సార్లు విన్న‌వించుకున్న కేంద్ర పెద్ద‌గా లెక్క చేయ‌లేదు. ప్ర‌త్యేక హోద గురించి రాష్ట్రంలో జ‌రిగిన ఉద్య‌మం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అలాగే, కేంద్ర హామీల్లో మ‌రో ముఖ్యం అంశం పోల‌వ‌రం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలోనూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌రైన స‌హ‌కారం ల‌భించ‌డం లేద‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు నాయ‌కులు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.  ఈ ప్రాజెక్టు అంచనాల విషయంలో రెండు సంవ‌త్స‌రాలుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్న ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. మోడీ స‌ర్కారు పెద్ద‌గా లెక్క చేయ‌డం లేదు.  ఇదే విషయంపై మోడీ స‌ర్కారు పార్ల‌మెంట్ లో  మాట్లాడుతూ.. ఈ  ప్రాజెక్టు నిర్ణీత సమయంలోగా పూర్తి కావడం కష్టమేనని తేల్చిచెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read: Telangana: తెలంగాణాలో పెరిగిన ఆత్మహత్యలు.. NCRB నివేదికలో షాకింగ్ విష‌యాలు !
పై విష‌యాల‌తో పాటు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితులు, క‌రోనా విష‌యాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది.  మొత్తంగా ఈ భేటీతో కాస్త హుషారుగా క‌నిపిస్తున్నారు విజ‌య‌సాయి రెడ్డి. కానీ ఈ భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వ హామీలు, రాష్ట్ర స‌మ‌స్య‌లు, ప‌రిస్థితుల గురించి ప్ర‌ధాని మోడీ ఏ విధంగా స్పందించార‌నే విష‌యాన్ని విజ‌య‌సాయి రెడ్డి వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో మోడీ-విజ‌య‌సాయి రెడ్డిల భేటీ నిజంగానే రాష్ట్ర స‌మ‌స్య‌ల గురించేనా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సొంత ప‌నుల విష‌యంపై ప్ర‌ధాని క‌లిశారా? అనే అనుమానాల‌ను ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు.  కాగా, ఇటీవ‌లి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్‌లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లారు. అయితే, వారికి ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెట్లు దొర‌క‌లేదు. దీంతో వారిని క‌ల‌వ‌కుండానే తిరిగివ‌చ్చారు. ఇలాంటి ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌ధాని మోడీతో భేటీ కావ‌డం ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read: Ponnala Lakshmaiah: లోపల దోస్తీ.. బయట కుస్తీ !

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios